Union Budget 2026
Union Budget 2026: దేశంలో రెండు ట్యాక్స్ విధానాలు ఉన్నాయి. ఒకటి పాత ట్యాక్స్ విధానం. రెండోది కొత్త ట్యాక్స్ విధానం. పాత దాంట్లో అంతా గజిబిజిగా ఉందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం కొత్త ట్యాక్స్ విధానం తీసుకొచ్చింది. పాత దాని కంటే కొత్తది మరింత సరళతరంగా ఉందని చెప్పింది. ప్రస్తుతానికి రెండు ట్యాక్స్ విధానాలు కొనసాగుతాయని అప్పట్లో కేంద్రం ప్రకటించింది. ఇక పన్ను చెల్లింపుదారులు ఎవరి లెక్కలు వారు వేసుకుని ఎవరికి నచ్చిన ట్యాక్స్ విధానంలో వాళ్లు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. కానీ, తాజాగా రూ.12 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ప్రకటించడంతో ఇక పాత, కొత్త ట్యాక్స్ విధానంలో పెద్ద తేడాలు ఉండకపోవచ్చు. దీంతోపాటు ట్యాక్స్ విధానాలను మరింత సరళతరం చేయాలని కేంద్రం భావిస్తోంది. దీంతో పాత ట్యాక్స్ రిజీమ్ కి టాటా చెప్పే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
Aslo Read : Union Budget 2026 : కేంద్ర బడ్జెట్‌లో మిడిల్ క్లాస్ ఏం కోరుకుంటోంది?
కొత్త ట్యాక్స్ విధానంలో కూడా మరింత సరళతరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో, వాటిని కూడా మార్పులు, చేర్పులు చేస కొత్త ట్యాక్స్ విధానం అనేదాన్ని పర్ ఫెక్ట్ గా చేయడానికి కేంద్రం ప్లాన్ చేస్తుంది. ఆ రకంగా పాత ట్యాక్స్ రిజీమ్ లో ఉన్న వారిని కూడా కొత్త దాని వైపు మళ్లించడానికి కృషి చేస్తుంది. ఆ రకంగా ప్రయత్నం చేశాక మెల్ల మెల్లగా పాత ట్యాక్స్ విధానాన్ని పూర్తిగా తీసేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సడన్ గా ప్రకటించకపోయినా.. ఫనాలా ఫైనాన్షియల్ ఇయర్ నుంచి కేవలం కొత్త ట్యాక్స్ విధానం ఒక్కటే ఉంటుందని, పాత ట్యాక్స్ విధానం ఆటోమేటిక్ గా రద్దవుతుందని పార్లమెంట్ సాక్షిగా బడ్జెట్ లో ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
గత రెండు మూడేళ్లుగా పన్ను చెల్లింపుదారుల్లో సుమారు 72 శాతం మంది కొత్త ట్యాక్స్ విధానానికి మొగ్గుచూపారు. పాత, కొత్త ట్యాక్స్ విధానాల్లో స్టాండర్డ్ డిడక్షన్లు సమానంగానే ఉన్నా కూడా రూల్స్ సరళతరంగా ఉండడం, టేక్ హోమ్ శాలరీ పెరుగుదలకు సంబంధించి బెనిఫిట్ కనిపిస్తుండడంతో చాలా మంది ఉద్యోగులు పన్ను చెల్లింపుదారులు కొత్త ట్యాక్స్ విధానంలోకి మారిపోతున్నారు.