Union Cabinet : 77 మందితో కేంద్రమంత్రి మండలి

కేంద్ర మంత్రి మండలి కొలువుదీరనుంది. మొత్తం 77 మంది ఉండనున్నారు. కొత్తగా టీంలో చేరిన వారు ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం జరుగనుంది. ఇప్పటికే ఛాన్స్ దక్కిన వారికి ఆహ్వాన పత్రాలు అందాయి.

Central Cabinet Update

Union Cabinet Expansion : కేంద్ర మంత్రి మండలి కొలువుదీరనుంది. మొత్తం 77 మంది ఉండనున్నారు. కొత్తగా టీంలో చేరిన వారు ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం జరుగనుంది. ఇప్పటికే ఛాన్స్ దక్కిన వారికి ఆహ్వాన పత్రాలు అందాయి. కొత్తగా 36 మందికి మంత్రి మండలిలో చోటు దక్కింది. సహాయ మంత్రులుగా ఉన్న ఏడుగురికి కేబినెట్ హోదా కల్పించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

కిషన్ రెడ్డి, హార్డీప్ సింగ్ పూరి, ఆర్కే సింగ్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, మన్ సుక్ మాండవియ, పురుషోత్తం రుపాలకు కేబినెట్ లో చోటు దక్కింది. గవర్నర్ గా నియమితులైన థావర్ చంద్ గెహ్లాట్ తో కలిపి ఇప్పటివరకు 12 మంది మంత్రులు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. గత రెండు సంవత్సరాలుగా ఆయా శాఖలో వారి పనితీరుతో పాటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వారికి ప్రమోషన్ ఇస్తున్నారు.

గుజరాత్ రాష్ట్రంలో వచ్చే సంవత్సరం ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు సహాయ మంత్రులకు కేబినెట్ హోదా కల్పించనున్నారని తెలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ తో పాటు గోవా, మణిపూర్ రాష్ట్రాలకు 2022లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చారని తెలుస్తోంది.