Delhi Ordinance Bill : నేడు పార్లమెంట్ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు.. వ్యతిరేకిస్తున్న విపక్ష కూటమి ఇండియా

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ తమ ఎంపీలకు ఇప్పటికే విప్ జారీ చేశాయి. ఎంపీలు ఆగస్టు 4 వరకు సభకు హాజరు కావాలంటూ నిర్ధేశించాయి.

Delhi Ordinance Bill

Parliament – Delhi Ordinance Bill : ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ కు సంబంధించిన బిల్లు ఇవాళ (మంగళవారం) పార్లమెంట్ ముందుకు రానుంది. దీనిని కేంద్ర మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీ పరిధిలో చాలా సేవలపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ పెంచేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ బిల్లు -2023 అని పిలుస్తారు. ఈ బిల్లుపై లోక్ సభ, రాజ్యసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగే అవకాశం ఉంది.

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ తమ ఎంపీలకు ఇప్పటికే విప్ జారీ చేశాయి. ఎంపీలు ఆగస్టు 4 వరకు సభకు హాజరు కావాలంటూ నిర్ధేశించాయి. మరోవైపు ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్ సభ ప్రధాన కార్యదర్శికి నోటీస్ ఇచ్చారు. ఈ బిల్లు రాజ్యాంగంలో ఫెడలరిజం సూత్రాన్ని ఉల్లంఘించేలా ఉందన్నారు.

Communal Violence : హర్యానాలో మత హింస..ముగ్గురి మృతి

ఢిల్లీ ప్రభుత్వంలోని అధికారుల బదిలీల అధికారాలపై ఈ ఆర్డినెన్స్ ను రూపొందించారు. ప్రభుత్వ అధికారుల బదిలీ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆ వెంటనే ఆర్డినెన్స్ ను తీసుకొచ్చి ప్రభుత్వ అధికారుల బదిలీ అధికారాన్ని కేంద్రం లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు కట్టబెట్టింది.

దీనిపై విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే ప్రభుత్వ అవినీతిని బయట పెడుతున్న విజిలెన్స్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తుందని.. దీంతో అవినీతి, అక్రమాలు బయటకు రావడం లేదని కేంద్రం ఆరోపిస్తోంది. అధికారుల బదిలీలపై లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు అధికారాలు ఉండాలంటూ కేంద్రం వాధిస్తోంది.