Highest Denomination Notes: రూ.2,000 రూ.500 నోట్లపై కీలక విషయం చెప్పిన కేంద్ర ప్రభుత్వం

ఆర్‌బీఐ లెక్కల ప్రకారం చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 76 శాతం బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. విలువ పరంగా చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లు ఉపసంహరణ ప్రకటించిన మే 19న రూ.3.56 లక్షల కోట్లు ఉండగా, జూన్ 30 నాటికి రూ.84,000 కోట్లకు తగ్గాయి

Highest Denomination Notes Clarity: 2016లో పెద్ద నోట్లను (రూ.1,000 రూ.500) రద్దు చేసి షాక్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం.. కొద్ది రోజుల క్రితం 2,000 రూపాయల నోటును కూడా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పుడున్న నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసింది. అయితే ఈ గడువు పొడగింపు సహా 500 రూపాయల నోటు రద్దు విషయమై కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ కీలక విషయాన్ని వెల్లడించింది. 2000 రూపాయల నోట్ల మార్పిడి గడువును సెప్టెంబర్ 30, 2023 తర్వాత పొడిగించే ప్రతిపాదన లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.

YS Sharmila: వైఎస్ షర్మిల బాణం కాంగ్రెస్ చేతికి చిక్కిందా.. అందుకే సికింద్రాబాద్ సీట్‌పై కన్నేశారా?

ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ బ్యాంకుల్లో 2000 రూపాయలు మార్చుకోవడానికి గడువును సెప్టెంబర్ 30 తర్వాత పొడిగించే ప్రతిపాదన ఉందా? అన్న ప్రశ్నకు ఈ సమాధానం చెప్పారు. అదే సమయంలో, నల్లధనాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం ఇతర మరిన్ని పెద్ద నోట్లను రద్దు చేయాలని యోచిస్తోందా అనే మరో ప్రశ్నకు చౌదరి సమాధానమిచ్చారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్‌సభలో కరెన్సీ గురించి పెద్ద చర్చ జరిగింది. ప్రభుత్వం త్వరలో 500 రూపాయల నోటును రద్దు చేస్తుందా? అనే ప్రశ్నకు ప్రస్తుతం ఈ అంశం పరిశీలనలో లేదని మంత్రి తెలిపారు.

Karnataka Politics: నాలుగు రోజుల్లోనే యూటర్న్ తీసుకున్న జేడీయూ.. బీజేపీతో పొత్తు ఉండదని ప్రకటన

ప్రస్తుతానికి 500 రూపాయల నోటు అతిపెద్ద కరెన్సీ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ తరపున సవివరమైన సమాచారం ఇస్తూ, ప్రస్తుతం అలాంటి ప్రణాళిక ప్రభుత్వం వద్ద లేదని పేర్కొంది. భవిష్యత్తులో దీనికి సంబంధించి ఏదైనా ప్లానింగ్ జరిగితే దాని గురించి తెలియజేస్తామని అన్నారు. ఆశ్చర్యకరమైన చర్యగా, మే 19న రిజర్వ్ బ్యాంక్ రూ. 2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే అటువంటి నోట్లను ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి లేదా బ్యాంకుల్లో మార్చుకోవడానికి ప్రజలకు సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చింది.

Minister Nitin Gadkari : ఓటర్లు తెలివైనవారు, ఓటుకు కిలో మటన్ పంచినా ఓడిపోయాను : మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆర్‌బీఐ లెక్కల ప్రకారం చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 76 శాతం బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. విలువ పరంగా చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లు ఉపసంహరణ ప్రకటించిన మే 19న రూ.3.56 లక్షల కోట్లు ఉండగా, జూన్ 30 నాటికి రూ.84,000 కోట్లకు తగ్గాయి. తిరిగి వచ్చిన నోట్లలో 87 శాతం ప్రజలు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని, మిగిలిన 13 శాతం ఇతర డినామినేషన్లలోకి మార్చారని ఆర్బీఐ తెలిపింది. ఆర్‌బిఐ ప్రకారం, ఉపసంహరణ అనేది ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లేదా ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు ఉద్దేశించిన కరెన్సీ నిర్వహణ ఆపరేషన్ అని మంత్రి తెలిపారు.