Minister Nitin Gadkari : ఓటర్లు తెలివైనవారు, ఓటుకు కిలో మటన్ పంచినా ఓడిపోయాను : మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఓటర్లు చాలా తెలివైనవారు..వారి నమ్మిన అభ్యర్థినే గెలిపిస్తారు. రాజకీయ నాయకులు మటన్ పంపిచినా..పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టినా..డబ్బులు, బహుమానాలు ఇచ్చినా ఓటర్లు మాత్రం తమకు నచ్చినవారినే గెలిపిస్తారని అన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరి. తాను ఓటుకు కిలో మటన్ పంచినా నన్ను ఓడించారని తెలిపారు.

Minister Nitin Gadkari : ఓటర్లు తెలివైనవారు, ఓటుకు కిలో మటన్ పంచినా ఓడిపోయాను : మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు

Nitin Gadkari provided mutton to voters

Updated On : July 25, 2023 / 3:57 PM IST

Minister Nitin Gadkari : నాగ్‌పూర్‌లో ఆదివారం మహారాష్ట్ర స్టేట్ టీచర్స్ (జులై,2023) ఏర్పాటు చేసిన స్టేట్ టీచర్స్ కౌన్సిల్ (MSTC) కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తాను ఓటర్లకు కిలో మటన్ పంచినా ఓడిపోయాను అంటూ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ఎన్నికల సమయంలో ఓటర్లకు మటన్ పంపిణీ చేసినా తాను ఓడిపోయానని..ఓటర్లపై నమ్మకం, ప్రేమను పెంపొందించడం ద్వారా ఎన్నికల్లో గెలుపు సాధించవచ్చని నితిన్ గడ్కరీ అన్నారు.

నేతలు ఎన్నికల్లో గెలవాలంటే పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టటం. మటన్ వంటివి పంచితో గెలుపు సాధించలేం..ప్రజలకు నమ్మకం కలిగించాలి..వారి ప్రేమను పొందితేనే విజయం సాధించగలం అంటూ తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించారు. ఎన్నికల గెలవటం కోసం తాను ఒక్కో ఓటరుకు కిలో మటన్ పంచానని కానీ ఆ తరువాత తను ఓడిపోయాననే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఓటర్లు చాలా తెలివైనవారు వారికి ఎవరిపై నమ్మకం ఉంటే వారినే గెలిపిస్తారు..ప్రతీ అభ్యర్థి ప్రజల నుంచి నమ్మకాన్ని పొందాలి.వారి ప్రేమను పొందాలి అంటూ చెప్పుకొచ్చారు. ఏ అభ్యర్థి సరైనవారు అని నమ్మితేనే గెలిపిస్తారని అన్నారు. కానీ చాలామంది పోస్టర్లు వేసి డబ్బులు పంచి కూడా గెలుస్తుంటారు. కానీ నేను అటువంటివి నమ్మను..నాకు జరిగిన సందర్భం నాకు అది నేర్పించింది అని తెలిపారు.

PM Modi : కన్నీరు పెట్టుకున్న ప్రధాని మోదీ.. అది I.N.D.I.A కూటమి కాదు ఈస్ట్ ఇండియా అంటూ ఆగ్రహం

రాజకీయ నాయకులు ప్రజల నమ్మకాన్ని, ప్రేమను సంపాదిస్తే చాలు అని సూచించారు. అప్పుడు డబ్బులు పంచడం, తాయిలాలు ఇవ్వడం, బ్యానర్లు, పోస్టర్లు వేయడం కోసం ఖర్చు చేసే అవసరం కూడా ఉండదన్నారు. ఒకవేళ అలా చేసినా గెలుస్తారనే నమ్మకం ఉండదన్నారు. దానికి తన అనుభవమే ఓ ఉదాహరణ అని.. తాను ఒక్కో ఓటరుకు ఒక కిలో మటన్ పంపిణీ చేసిన తర్వాత కూడా ఎన్నికల్లో ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఓటర్లు చాలా తెలివైనవారని, ప్రతి అభ్యర్థి నుండి వారు ఎన్నికల సమయంలో వచ్చే డబ్బులు, కానుకలు తీసుకున్నా..చివరకు మాత్రం తమకు సరైన లేదా నచ్చిన అభ్యర్థికే ఓటు వేస్తారని ఈ విషయాన్ని రాజకీయ నాయకులు తెలుసుకోవాలని సూచించారు.