Nirmala Sitharaman: సాంకేతికత ఉపయోగించి రూ.2,00,000 కోట్లు ఆదా చేశాం.. కేంద్ర ఆర్థిక మంత్రి

డిబిటి వంటి వ్యవస్థలు లీకేజీలను ఆపడం ద్వారా కేంద్ర ప్రభుత్వం 2,00,000 కోట్ల రూపాయల్ని ఆదా చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దత్తోపంత్ తెంగడి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‭లో మంగళవారం నిర్వహించిన '21వ శతాబ్దపు గ్లోబల్ సినారియోలో భారత్ ఆర్థిక సంభావ్యత' అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ

Nirmala Sitharaman: సాంకేతికతను ఉపయోగి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) వంటి వ్యవస్థలు లీకేజీలను ఆపడం ద్వారా కేంద్ర ప్రభుత్వం 2,00,000 కోట్ల రూపాయల్ని ఆదా చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దత్తోపంత్ తెంగడి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‭లో మంగళవారం నిర్వహించిన ’21వ శతాబ్దపు గ్లోబల్ సినారియోలో భారత్ ఆర్థిక సంభావ్యత’ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. “సాంకేతికత వినియోగం వల్ల రూ.2,00,000 కోట్లు ఆదా చేశాం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ కింద ఉన్న డబ్బు మోసం జరిగే అవకాశం లేకుండా నేరుగా ఆధార్-ధృవీకరించబడిన ఖాతాలోకి చేరుతోంది” అని నిర్మలా అన్నారు.

NDTV: పూర్తిగా అదానీ చేతుల్లోకి NDTV.. డైరెక్టర్లుగా రాజీనామా చేసిన ప్రణయ్ రాయ్, రాధికా రాయ్

ట్రెండింగ్ వార్తలు