Ajay Mishra : కేంద్ర హోంశాఖ సహాయమంత్రిని బ్లాక్ మెయిల్..ఐదుగురు అరెస్ట్

ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో ఈ ఏడాది అక్టోబర్-3న జరిగిన హింసాత్మక ఘటనల వీడియోలతో కొంతమంది తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా

Misra

Ajay Mishra : ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో ఈ ఏడాది అక్టోబర్-3న జరిగిన హింసాత్మక ఘటనల వీడియోలతో కొంతమంది తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా డిసెంబర్-17న చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఐదుగురు సభ్యుల ముఠాను శుక్రవారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఐదుగురు నిందితులందరూ బీపీఓ వర్కర్లు అని పోలీసులు తెలిపారు. వీరిలో నలుగురు నోయిడాకు చెందినవారు కాగా.. ఒకరు ఢిల్లీ వాసి అని పోలీసులు తెలిపారు.

కాగా,లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనకు సంబంధించి ఐదుగురు రోజూ తనకు ఫోన్​ చేసి బెదిరిస్తున్నారని అజయ్ మిశ్రా ఢిల్లీ పోలీస్ కమిషనర్​ రాకేశ్ అస్థానాకు గత వారం ఫిర్యాదు చేశారు. తనను కోట్ల రూపాయాల డబ్బులు డిమాండ్ చేశారంటూ కేంద్రమంత్రి చేసిన ఫిర్యాదు మేరకు నార్త్ అవెన్యూ పోలీస్ స్టేషన్​లో ఎఫ్​ఐఆర్ నమోదైంది. ప్రత్యేక బృందం దర్యాప్తు ప్రారంభించి మంత్రిని బ్లాక్​మెయిల్​ చేసిన ఐదుగురిని ఇవాళ అరెస్టు చేసింది.

కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను బ్లాక్​ మెయిల్ చేసిన ఐదుగురు సభ్యుల ముఠాను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. లఖింపుర్ ఖేరి ఘటనకు సంబంధించి వాళ్లంతా కొద్ది రోజులుగా కాల్ చేసి తనను బెదిరిస్తున్నారని మంత్రి ఫిర్యాదు చేశారు.

ఈ ఏడాది అక్టోబర్-3న అజయ్ మిశ్రా సొంత ప్రాంతమైన లఖింపూర్ ఖేరి పర్యటనకు యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తుండగా..మౌర్య పర్యటనకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేశారు. నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ నినదిస్తూ మౌర్య కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు రైతులు. అయితే ఈ క్రమంలో ఓ కారు ఆందోళన చేస్తోన్న రైతులను తొక్కించుకుంటూ వెళ్లిన ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు,ఓ జర్నలిస్ట్ కూడా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

అయితే రైతులను కారుతో తొక్కించింది కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రానేనని రైతులు ఆరోపించారు. దీంతో ఆశిష్ మిశ్రాను కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ ఘటనపై విచారణ జరిపేందుకు యూపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(SIT)ఏర్పాటు చేసింది. అయితే రైతులను హత్య చేయడానికి పక్కా ప్రణాళికతోనే కుట్ర జరిగిందని, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఇటీవల తన నివేదికను లఖింపూర్ ఖేరీ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ముందుంచింది. కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాతో పాటు మరో 12 మందికి ఈ ఘటనతో ప్రమేయమున్నట్లు ఆ నివేదికలో పేర్కొంది. వీరిపై హత్య, హత్యాయత్నం నేరాభియోగాల కింద కఠినంగా శిక్షించాలని సిట్‌ దర్యాప్తు అధికారి విద్యారామ్‌ దివాకర్‌ కోరారు.

ALSO READ Telangana: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫెయిలైనవారంతా పాస్!