Telangana: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫెయిలైనవారంతా పాస్!

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం.

Telangana: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫెయిలైనవారంతా పాస్!

Sabitha Inter Students

Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఇంటర్మీడియట్‌ ఫెయిలైన వారందరినీ కనీస మార్కులతో పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల త‌రువాత విద్యార్థుల నుంచి వ్య‌క్తమ‌వుతున్న‌ ఆందోళనలను అర్థం చేసుకున్న ప్రభుత్వం వారికోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఫ‌లితాలపై విద్యార్థులతో పాటు త‌ల్లిదండ్రులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న క్రమంలో ఫస్టియర్ విద్యార్థులను అందరినీ పాస్ చేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఇంటర్ ఫలితాలపై జరుగుతున్న మొత్తం ర‌చ్చకు ఫుల్ స్టాప్ పెట్టేసింది ప్రభుత్వం.

ఇంట‌ర్మిడియ‌ట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో దాదాపు 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వగా.. వారందరినీ పాస్ చేస్తున్నట్లు సబిత చెప్పారు.
అందరినీ పాస్‌ చేయడం ఇదే చివరిసారి అని కూడా సబిత స్పష్టం చేశారు. సెకండియర్‌ పరీక్షలకు విద్యార్థులు మాత్రం బాగా ప్రిపేర్‌ కావాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 4,59,242మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. అందులో 2,24,012మంది పాస్‌ అయ్యారు.

గతేడాది లాక్‌డౌన్‌, ఆన్‌లైన్ క్లాసులు సరిగ్గా జరగని కారణంగా టీచింగ్ సిలబస్‌ను కూడా విద్యాశాఖ మార్చింది. కనీస మార్కులు 35 శాతం వేసి ఫెయిలైన విద్యార్థులను పాస్‌ చేస్తున్నట్లు లేటెస్ట్‌గా విద్యాశాఖ ప్రకటించింది. ఈ విషయంపై తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.