Minister Ajay Mishra : ‘రాకేశ్ టికాయత్ ఓ బి గ్రేడ్ వ్యక్తి..రోడ్డుపై వెళుతుంటే కుక్కలు మొరుగుతుంటాయ్’ అంటూ కేంద్రమంత్రి వ్యాఖ్యలు

రాకేశ్ టికాయత్ ఓ బి గ్రేడ్ వ్యక్తి..రోడ్డుపై వెళుతుంటే కుక్కలు మొరుగుతుంటాయ్’ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Minister Ajay Mishra : కేంద్ర  హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రైతులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకువచ్చింది. ఈ వీడియోలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) సారథి రాకేశ్ టికాయత్‌ గురించి.. లఖింపూర్‌లో ఆందోళన చేసిన రైతులను ఉద్దేశించి తన సహచరులతో మాట్లాడుతూ రైతులను కుక్కలతో పోల్చినట్లుగా ఉంది.

ఆ వీడియోలో ఆయన తన సహచరులతో మాట్లాడుతూ.. నేను కారులో వేగంగా వెళ్లినప్పుడు రోడ్డుపై ఉండే కుక్కలు అరవడమో, వెంటపడడమో చేస్తుంటాయి..అలా చేయటం వాటి అలవాటు..అవి అరిచాయి కదాని ఆ అరుపుల్ని మనం పట్టించుకుంటామా? కాబట్టి ఈ విషయం గురించి ఎక్కువ మాట్లాడను అన్నారు.ఈ విషయంపై అవసరం అయినప్పుడు సమాధానం ఇస్తానంటూ వ్యాఖ్యానించారు. నాకుఉన్న ధైర్యానికి మీ మద్దతే కారణమంటూ ఆయన వారితో చెప్పుకొచ్చారు.

అంతే కాకుండా మంత్రి రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ గురించి మాట్లాడుతూ.. ఆయనగారి గురించి నాకు తెలుసు.. ‘దో కౌడీ కా ఆద్మీ’  ఆయనొక (బి గ్రేడ్ వ్యక్తి) అంటూ హేళన చేసిన మాట్లాడారు.ఎన్నికల్లో పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయిన అలాంటి వ్యక్తి వ్యాఖ్యలకు విలువ ఉండదనీ..అటువంటివారు అడిగే ప్రశ్నలకు తాను బదులివ్వనని తెగేసి చెప్పారు. దీనికిసంబంధించిన వీడియో బయటకు రావటంతో కేంద్రమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై రాకేశ్ టికాయత్ చాలా హుందాగా స్పందించారు. ఆయన కుమారుడు జైలుకు వెళ్లిన బాధలో ఉండడంతోనే ఆయనలా మాట్లాడి ఉంటారని అన్నారు.

కాగా..2021 అక్టోబరులో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో ఆందోళన చేస్తున్న రైతులపైకి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా..ఆ తరువాత జరిగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు చనిపోయారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రా అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన బెయిలుపై ఉన్నారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. ఈక్రమంలో రైతులను కుక్కలతో పోలుస్తు వ్యాఖ్యానించారు సందరు మంత్రిగారు. కాగా మిశ్రా ఖేరీ నుంచి బీజేపీ టికెట్‌పై వరుసగా రెండోసారి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. మంత్రి కూడా అయ్యారు.

 

ట్రెండింగ్ వార్తలు