Skill India Digital: ప్రతి భారతీయుడికి నాణ్యమైన నైపుణ్యాభివృద్ధితో పాటు సరైన అవకాశాలు దక్కే విధంగా స్కిల్ ఇండియా డిజిటల్ (SID)ని ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. దేశంలో వ్యక్తుల యొక్క నైపుణ్యాలు, విద్య, ఉపాధి, వ్యవస్థాపకత ల్యాండ్‌స్కేప్‌ను సమన్వయం చేయడం ఈ స్కిల్ ఇండియా డిజిటల్ లక్ష్యం. నైపుణ్య కోర్సులు, ఉద్యోగావకాశాలు, వ్యవస్థాపకత మద్దతు కోసం మెరుగైన అవకాశాలు, ఉజ్వల భవిష్యత్తును కోరుకునే మిలియన్ల మంది భారతీయుల ఆకాంక్షలు, కలలను ఈ ప్లాట్‌ఫారమ్ ప్రతిబింబిస్తుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత & ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.
స్కిల్ ఇండియా డిజిటల్ అనేది భారతదేశ నైపుణ్యం, విద్య, ఉపాధి, వ్యవస్థాపకత పర్యావరణ వ్యవస్థ కోసం రూపొందించిన ఒక అద్భుతమైన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇది డిజిటల్ టెక్నాలజీ, ఇండస్ట్రీ 4.0 నైపుణ్యాలపై దృష్టి సారిస్తుంది. తద్వారా నైపుణ్యాభివృద్ధిని మరింత వినూత్నంగా, అందుబాటులోకి తీసుకురావడానికి వ్యక్తిగతీకరించడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల నియామకాన్ని వేగవంతం చేసేందుకు, జీవితకాల అభ్యాసాన్ని సులభతరం చేసేందుకు ఒక అత్యాధునిక ప్లాట్‌ఫారమ్ ఏర్పడుతుంది.
Bigg Boss: రేటింగ్స్‌లోనూ బిగ్ బాసే.. నాగార్జున బిగ్ బాస్ ఏడో సీజన్ దూకుడు మామూలుగా లేదుగా
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, స్కిల్ ఇండియా డిజిటల్ అనేది అన్ని నైపుణ్య కార్యక్రమాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఉపయోగించే ఒక అత్యాధునిక వేదిక. గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నైపుణ్యాల మధ్య ఉన్న అంతరాలను పరిష్కరించడానికి భారతదేశం యొక్క విజయవంతమైన G20 ప్రెసిడెన్సీకి ఇది కేంద్రబిందువు అని అన్నారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రూపొందించే దిశగా మరో ముందడుగు వేస్తూ, ఎమ్ఎస్డీఈ భారతదేశంలోని విభిన్న జనాభా నైపుణ్య అవసరాలను పరిష్కరించడానికి ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫారమ్‌ను సృష్టించిందని ఆయన అన్నారు.