Bigg Boss: రేటింగ్స్‌లోనూ బిగ్ బాసే.. నాగార్జున బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ దూకుడు మామూలుగా లేదుగా

దాదాపు 5.1 కోట్ల ప్రేక్షకులు మొదటి వారం బిగ్ బాస్ షో చూశారని పేర్కొంది. "బిగ్ బాస్ సీజన్ 7" లాంచ్ ప్రోగ్రామ్‌ను..

Bigg Boss: రేటింగ్స్‌లోనూ బిగ్ బాసే.. నాగార్జున బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ దూకుడు మామూలుగా లేదుగా

Bigg Boss Telugu 7

Updated On : September 14, 2023 / 9:22 PM IST

Bigg Boss Telugu 7: బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ కి కూడా ప్రేక్షకుల నుంచి ఊహించని విధంగా ఆదరణ లభిస్తోందని స్టార్ మా తెలిపింది.  “బిగ్ బాస్ సీజన్ 7” ఎన్నో సంచలనాలకు వేదికైందని పేర్కొంది. రేటింగ్స్ , వ్యూయర్ షిప్ పరంగా ఊహించని ఎన్నో అద్భుతాలకు “బిగ్ బాస్ సీజన్ 7” వేదికగా నిలిచిందని పేర్కొంది.


Bigg Boss Telugu 7

తెలుగు టెలివిజన్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించిందని తెలిపింది. దాదాపు 5.1 కోట్ల ప్రేక్షకులు మొదటి వారం బిగ్ బాస్ షో చూశారని పేర్కొంది. “బిగ్ బాస్ సీజన్ 7” లాంచ్ ప్రోగ్రామ్ ను సుమారు 3 కోట్ల మంది ప్రేక్షకులు చూడడంతో గతంలో క్రికెట్ మ్యాచ్ ల వ్యూస్ ల పరంగా నమోదైన రికార్డులను కూడా ఈ ప్రోగ్రాం అధిగమించిందని పేర్కొంది.

గత సీజన్ లో సాధించిన రేటింగ్స్ తో పోల్చితే 40 శాతం అధిక రేటింగ్ సాధించిందని తెలిపింది. ఈ సీజన్ ఉల్టా పల్టాగా ఉండబోతుందని ఈ షో వ్యాఖ్యాత నాగార్జున ప్రోమోలో చెప్పిన నాటి నుంచి దీనిపై అంచనాలు బాగా పెరిగాయని పేర్కొంది. అత్యధిక టీవీఆర్ 18.1 సాధించినట్లు తెలిపింది. స్టార్ మాలోనే కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్, యూ ట్యూబ్ లో కూడా “బిగ్ బాస్ సీజన్ 7” కు ఆదరణ బాగా ఉందని పేర్కొంది.


Navdeep : పరారీలో నవదీప్..! డ్రగ్స్ కేసులో మరోసారి తెరపైకి హీరో పేరు