L Murugan Parents : కొడుకు కేంద్ర మంత్రి అయినా.. ఎండలో కష్టం చేస్తున్న రైతులు
కొడుకు కేంద్ర మంత్రి అయినా తల్లిదండ్రులు తమ వృత్తిని మరువలేదు. ఇప్పటికి వ్యవసాయం చేస్తూనే జీవనం సాగిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు కేంద్ర మంత్రి తల్లిదండ్రులు. తమిళనాడుకు చెందిన బీజేపీ నేత ఎల్. మురుగన్ కు తాజాగా మోదీ 2.0 మంత్రివర్గంలో స్థానం లభించింది. ఆయనను కేంద్ర మంత్రి పదవి వరించింది. కొడుకు కేంద్రమంత్రి అయినా తల్లిదండ్రులు మాత్రం తమ వృత్తిని వదులుకోలేదు. ఇప్పటికి వ్యవసాయం చేస్తున్నారు.
L Murugan Parents : కన్నబిడ్డలు ఎంత ఎత్తుకు ఎదిగినా, కొడుకులు కోట్ల రూపాయలు సంపాధించినా, రాజకీయంగా ఉన్నతస్థాయికి చేరినా కొందరు తల్లిదండ్రులు మాత్రం సాధారణ జీవితం గడపడానికే ఇష్టపడుతుంటారు. తమ వంశపారంపర్యంగా వస్తున్న వృత్తిని కొనసాగిస్తుంటారు. ఎంత కష్టం వచ్చినా దానిని మాత్రం వదిలిపెట్టరు. తమ శరీరంలో శక్తి ఉన్నవరకు కష్టపడుతూనే ఉంటారు. తమ సంతానం ఎంత ఎత్తుకు ఎదిగినా సాధారణ జీవితం గడుపుతూ కోట్లమందికి ఆదర్శనంగా నిలుస్తారు కొందరు తల్లిదండ్రులు.
ఆలా సాధారణ జీవితం గడుపుతున్న కేంద్ర మంత్రి తల్లిదండ్రుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొడుకు కేంద్రమంత్రి అయినా కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు తమిళనాడుకు చెందిన దంపతులు. తాజాగా జరిగిన మంత్రివర్గ కూర్పులో తమిళనాడుకు చెందిన బీజేపీ నేత ఎల్. మురుగన్ కు చోటు దక్కింది. ఇంతకాలం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన మురుగన్.. తాజాగా కేంద్రమంత్రి అయ్యారు. కొడుకు కేంద్ర మంత్రి అయినా తల్లిదండ్రులు లోగనాథన్, వరుదమ్మాల్ వ్యవసాయం చేయడం మానలేదు.
పారాపలుగు పట్టి వ్యవసాయ పనులకు పోతున్నారు ఈ దంపతులు. నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన మురుగన్ ఉన్నత చదువులు చదివారు. న్యాయవాదిగా అనేక కేసులు వాదించి విజయం సాధించారు.. అంచలంచలుగా ఎదిగి కేంద్ర మంత్రి స్థాయికి చేరాడు. ఖాళీ దొరికినప్పుడు తల్లిదండ్రులకు వ్యవసాయంలో సాయం చేస్తూ పార్టీ పనులు చూసుకునే వారు. ఆలా ఎన్ని పదవులు వచ్చినా వ్యవసాయం మాత్రం వదలలేదు.
ఇప్పటికి తమ భూమిని చదును చేసి పంట పండిస్తున్నారు. ఇలా కేంద్రమంత్రి తల్లిదండ్రులై ఉండికూడా ఎటువంటి హంగు ఆర్బాటం లేకుండా పొలం పనులు చేసుకుంటున్న ఈ దంపతులను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇదే విషయమై మీడియా వారిని ప్రశ్నించగా.. కొడుకు మురుగన్ కేంద్ర మంత్రి అయినా, ఇంకే పదవి చేపట్టినా తమ పద్దతి మార్చుకోలేమని, జీవించడానికి కష్టపడి సంపాధించుకుంటామని, ఒకరి మీద ఆధారపడటం తమకు ఇష్టం ఉండదని, ఓపిక ఉన్నంతవరకు పొలం పనులు చేస్తామనిలోగనాథన్, వరదమ్మాల్ దంపతులు అంటున్నారు.