Minister Nirmala Sitharaman: మార్కెట్‌కు వెళ్లి స్వయంగా కూరగాయలు కొనుగోలు చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. వీడియో వైరల్

పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం చెన్నైకి వెళ్లిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాత్రి సమయంలో మైలాపూర్‌లోని కూరగాయల మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ ఆమె స్వయంగా కూరగాయలను కొనుగోలు చేశారు. అనంతరం కూరగాయల వ్యాపారులు, స్థానికులతో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Finance Minister Nirmala Sitharaman

Minister Nirmala Sitharaman: దేశ ఆర్థిక మంత్రి హోదాలో నిత్యం బిజీగా ఉండే నిర్మలా సీతారామన్ కూరగాయల మార్కెట్‌లో ప్రత్యక్ష్యమయ్యారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం తమిళనాడు రాజధాని చెన్నైకు వచ్చారు. ఈ క్రమంలో రాత్రి సమయంలో చెన్నైలోని మైలాపూర్ ప్రాంతంలో కూరగాయల మార్కెట్ కు వెళ్లారు. అక్కడ పలు రకాల కూరగాలను కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోను నిర్మలా సీతారామన్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.

Putin Tightens Security: కెర్చ్ వంతెనపై పేలుడు ఎఫెక్ట్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ భద్రత కట్టుదిట్టం.. పేలుడుకు కారణం ఎవరంటే?

కూరగాయల మార్కెట్‌కు వెళ్లిన ఆమె ఓ దుకాణం వద్దకు వెళ్లి వివిధ రకాల కూరగాయల ధరల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆమె స్వయంగా పలురకాల కూరగాయలను తనిఖీచేసుకొని కొనుగోలు చేశారు. అనంతరం అక్కడే ఉన్న కూరగాయల వ్యాపారులతో, స్థానిక ప్రజలతో మాట్లాడారు. కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి అంటూ ఆరా తీశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఊహించని విధంగా కేంద్ర మంత్రి స్వయంగా కూరగాయలు కొనుగోలు చేసేందుకు మార్కెట్ రావడంతో స్థానికులు కేంద్ర మంత్రితో మాట్లాడేందుకు పోటీపడ్డారు. ప్రస్తుతం ఆమె ట్వీట్ చేసిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.