Piyush
Union Minister Piyush Goyal : తెలంగాణ రాష్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శలు గుప్పించారు. వరుస ఓటములు ఎదురవుతుండడంతో సీఎం కేసీఆర్ పరేషాన్ అవుతున్నారని, రైతులకు, ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి ఎంత సాయం అవసరమైతే..అంత అందిస్తున్నట్లు, ఇప్పటి వరకు గత రబీ టార్గెట్ రాష్ట్ర ప్రభుత్వం అందించలేకపోయిందని, నాలుగు సార్లు గడువు పొడిగించినా ఇవ్వలేకపోయారని చెప్పారు. 2021, డిసెంబర్ 21వ తేదీ మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో వారు ఆయనతో చర్చించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ…
Read More : S-400 Air Defence System : పాక్,చైనాకు దబిడిదిబిడే..పంజాబ్ లో S-400 మొహరింపు
దేశంలో ప్రస్తుతం వచ్చే రబీలో ముడి బియ్యం ఇవ్వమని అడుగుతున్నట్లు, డిమాండ్ ఉన్న రకం బియ్యాన్ని ఇవ్వమని చెబుతున్నామన్నారు. బాయిల్డ్ రైస్ ఎవరూ తినడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే తమకు ఓ లేఖ ఇచ్చిందని విషయాన్ని ఆయన చెప్పారు. బలవంతంగా లెటర్ రాయించుకున్నాం అన్న మాట నిజం కాదన్నారు. భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఎంత ముడి బియ్యం ఇచ్చినా తాము తీసుకుంటామని చెబుతున్నా…తమ మీద చేసిన వ్యాఖ్యలు, నిందలను ఖండిస్తున్నట్లు తెలిపారు.
Read More : Himalaya Glaciers Melting : వేగంగా కరిగిపోతున్న హిమనీ నదాలు..ప్రమాదంలో బ్రహ్మపుత్ర, గంగా, సింధు నదులు
వెంటనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సప్లై చేయలేక రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఒప్పందం ప్రకారం ఇవ్వడంలో గోడౌన్ లభ్యత లేదు అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు నిజం కాదని స్పష్టం చేశారు. గత రబీ కోటాయే ఇంకా పూర్తి కాలేదని మరోసారి చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి రావడంపై ఆయన తప్పుబట్టారు. మా పనుల్లో బిజీగా ఉన్నామని, ఈటల గెలుపుతో వారికి ఏం చేయాలో అర్థం కాక వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణా ప్రజలకు మోదీ ప్రభుత్వం పూర్తి అండగా ఉందని..ఇక ముందు కూడా ఉంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.