Himalaya Glaciers Melting : వేగంగా కరిగిపోతున్న హిమనీ నదాలు..ప్రమాదంలో బ్రహ్మపుత్ర, గంగా, సింధు నదులు

హిమాలయాల్లో హిమనీనదాలు అత్యంత వేగంగా కరిగిపోతున్నాయని..ఈ ప్రభావం జీవనదులు అయిన బ్రహ్మపుత్ర, సింధు, గంగానదులపై ఉంటుందని..కోట్లాదిమంది పెను ప్రమాదంలో పడతారని సర్వే హెచ్చరిస్తోంది.

Himalaya Glaciers Melting : వేగంగా కరిగిపోతున్న హిమనీ నదాలు..ప్రమాదంలో బ్రహ్మపుత్ర, గంగా, సింధు నదులు

Students Suicide

Himalayan glaciers melting at exceptional rate due to warming  : జీవనదులకు పుట్టిల్లు హిమాలయాలు. ప్రపంచంలోనే ఎత్తైనవి. ఈ హిమాలయాల్లోని మంచు కరిగి నదులుగా ప్రవహిస్తాయి. అలా హిమాలయాల్లో పుట్టిన జీవనదులు బ్రహ్మపుత్ర, గంగా, సింధు నదులు. మరి హిమాలయాల్లో మంచు హిమనీనదాలు అంటే గ్లేసియర్లు కరిగిపోతే..!హిమాలయాల్లో మంచే లేకపోతే..మరి ఈ జీవనదులు మనుగడ ఏంటీ? అనే ప్రశ్నే ఊహించలేం.ఆ విపత్తును అస్సలు భరించలేం. కానీ హిమాలయాల్లో హిమనీనదాలు (glaciers) ఊహించనంత వేగంగా కరిగిపోతున్నాయని లీడ్స్‌ యూనివర్సిటీ నివేదిక హెచ్చరిస్తోంది. గోబల్ వార్మింగే దీనికి కారణం..ఈ భూతాపానికి కారణం మనిషే అని చెప్పకతప్పదు. భూతాంపం పెరుగుతుండటంతో అనూహ్యంగా హిమనీనదాలు కరిగిపోతున్నాయని దీని వల్ల నదుల దేశంగా పిలుచుకునే భారత్ లోని జీవనదులకు ప్రమాదం తప్పదని హెచ్చరిస్తోంది లీడ్స్ యూనివర్శిటీ నివేదిక. జీవనదులు ప్రమాదంలో పడితే..! నీటిబాధలు తప్పవు..!! జీవనదులకే ప్రమాదం వాటిల్లితే..ఆసియాలో కోట్లాది ప్రజలకు నీరు లభించం ప్రశ్నార్ధకం అవుతుందని సోమవారం (డిసెంబర్ 20,2021) ఈ నివేదిక తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను లండన్‌కు చెందిన ఈయూనివర్సిటీ నివేదిక జర్నల్‌ సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌లో ప్రచురించారు.

Read more :  ప్రమాదకర స్థితిలో మంచునదులు..ఉత్తరాఖండ్ వంటి విషాదాలు మరిన్ని జరిగే అవకాశాలున్నాయా? పొంచి ఉన్న ప్రమాదాలేంటీ?

400–700 సంవత్సరాల క్రితం జరిగిన గ్లేసియర్‌ ఎక్స్‌పాన్షన్‌ సమయం (లిటిల్‌ ఐస్‌ ఏజ్‌)తో పోలిస్తే గత కొన్ని దశాబ్దాల్లో హిమాలయన్‌ గ్లేసియర్స్‌లో మంచు 10రెట్లు అధికంగా కరిగిపోయిందని లీడ్స్ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని హిమానీ నదాల కంటే..హిమాలయాల్లోని గ్లేసియర్లు అత్యంత వేగంగా కరిగిపోతున్నాయని హెచ్చరించింది. హిమాలయాల్లోని 14,798 గ్లేసియర్లు లిటిల్‌ ఐస్‌ ఏజ్‌ సమయంలో ఎలా ఉన్నాయో నివేదిక స్టడీ చేసింది.

అప్పట్లో ఇవి 28,000 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నాయని అవి ఇప్పుడు 19,600 చదరపు కిలోమీటర్లకు పరిమితమయ్యాయని తెలిపింది. అంటే దాదాపు 40 శాతం మేర కోల్పోయాయని తెలిపింది. ఆ సమయంలో మంచు కరుగుదల కారణంగా ప్రపంచ సముద్ర మట్టాలు 0.92– 1.38 మీటర్ల చొప్పున పెరిగాయని..ప్రస్తుత మంచు కరుగుదల అంతకు 10 రెట్లు ఎక్కువగా ఉందని ఈ నివేదిక రచయిత జొనాధన్‌ కార్విక్‌ వెల్లడించారు. మానవ ప్రేరిత శీతోష్ణస్థితి మార్పుల కారణంగా మంచు కరిగే వేగం పెరిగిందని తెలిపారు.

Read more : Students Suicide : 7 ఏళ్లలో 122 మంది ఐఐటీ విద్యార్థుల ఆత్మహత్య: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

అంటార్కిటికా, ఆర్కిటికాల తరువాత హిమాలయాల్లోని గ్లేసియర్లలో మంచు అధికం. అందుకే హిమాలయాలను 3rd పోల్‌ (మూడో ధృవం)గా పిలుస్తారు. ఆసియాలోని అనేకనేక దేశాల జనాభాకు అవసరాలు తీరుస్తున్న పలు నదులకు ఈ హిమానీ నదాలు జన్మస్థానం. బ్రహ్మపుత్ర, గంగ, సింధుతో పాటు పలు చిన్నా పెద్ద నదులకు హిమాలయాలే జన్మస్థానం. ఈ నదులు క్షీణించిపోతే ఇక కోట్లాది మంది ప్రజల మనుగడ ప్రశ్నార్థకమైపోతుంది. సాగునీకే కాదు తాగునీరు కూడా కరవైపోతుందని ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. హిమాలయాల్లో పుట్టిన బ్రహ్మపుత్ర, గంగ, సింధుతో పాటు పలు చిన్నా పెద్ద నదులకు హిమాలయాలే జన్మస్థానంగా వెలుగొందుతున్నాయి. మంచు కరిగి నదులకు జన్మనిస్తున్నాయి హిమాలయాలు. కానీ పెరుగుతున్న భూతాంపతో మంచు కరుగుదల చాలా వేగంగా జరుగుతోంది. గతకాలంలో మంచు కరుగుదల, గ్లేసియర్ల విస్తీర్ణం మదింపునకు పరిశోధక బృందం శాటిలైట్‌ చిత్రాలను, డిజిటల్‌ సాంకేతికతను ఉపయోగించింది.

Read more : kerala High Court : కోవిడ్ సర్టిఫికేట్‌‌పై మోదీ ఫొటో తొలగించాలని పిటిషన్..రూ. లక్ష ఫైన్ వేసిన కోర్టు

గతంలో గ్లేసియర్లు ఏర్పరిచిన హద్దులను శాటిలైట్‌ చిత్రాల ద్వారా కనుగొని, ప్రస్తుత హద్దులతో పోల్చడం ద్వారా గ్రేసియర్ల క్షీణతను లెక్కించారు పరిశోధకులు. హిమాలయాల తూర్పు ప్రాంతంలో గ్లేసియర్ల క్షీణత అత్యంత వేగంగా ఉందని గుర్తించారు. హిమానీ నదాలు సరస్సుల్లో కలిసే ప్రాంతాల్లో వీటి క్షీణత ఇంకా ఎక్కువగా ఉందని తెలుసుకున్నారు.

ఇలాంటి సరస్సుల సంఖ్య, విస్తీర్ణం పెరగడమనేది గ్లేసియర్లు కుంచించుకుపోతున్నాయనేందుకు నిదర్శనమని తెలిపింది. మానవ ప్రేరిత ఉష్ణోగ్రతా మార్పులను అడ్డుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని లేదంటే పెను ముప్పు తప్పదని…జీవనదులకు ప్రమాదం ఏర్పడింది అంటే అది మనిషి మనుగడకే ప్రమాదమని నివేదిక హెచ్చరించింది. తగిన చర్యలు తీసుకోవాలని లీడ్స్ యూనివర్శిటీ నివేదిక పిలుపునిచ్చింది.