Helmet Must : హెల్మెట్ రూల్ లైట్ తీసుకుంటే తప్పదు కేసు : పోలీసుల వార్నింగ్

బైక్ నడిపినా..వెనుక కూర్చున్నా ఇద్దరికి హెల్మెట్ పెట్టుకోవటం తప్పనిసరి అని..ఈ నిబంధన అతిక్రమిస్తే ఇకపై కఠిన చర్యలు తీప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

Helmet Must : హెల్మెట్ రూల్ లైట్ తీసుకుంటే తప్పదు కేసు : పోలీసుల వార్నింగ్

Helmet Must

Helmet Must : బైక్ నడిపినా..వెనుక కూర్చున్నా ఇద్దరికి హెల్మెట్ పెట్టుకోవటం తప్పనిసరి అని పోలీసులు పదే పదే మొత్తుకుంటున్నారు. హెచ్చరిస్తున్నారు. హెల్మెట్ లేకపోవటం వల్లే ప్రమాదంలో మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని..హెల్మెట్ అనేది తప్పనిసరి చేసుకోవాలని..ఇది మీ ప్రాణాలకు సురక్షితం అని సూచిస్తున్నారు. కానీ చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇకనుంచి బైక్ నడిపేవారితో పాటు వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ ధరించకపోతే కేసు నమోదు తప్పదని హెచ్చరించారు.

వాహనదారులు హెల్మెట్ నిబంధనను లైట్ గా తీసుకుంటుండడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరోసారి తీవ్రంగా హెచ్చరించారు. హెల్మెట్ పెట్టుకోవటం ఎంత ఇంపార్టెంటో అనే విషయం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని.. కానీ చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారని..అటువంటివారు మారకపోతే వారిని ఎలా దారికి తీసుకురావాలో మాకు బాగా తెలుసు అని హెచ్చరించారు.

Read more : Cough SyruHigh Court : ఇద్దరి ఇష్టంతో సహజీవనం ప్రాథమిక హక్కు..వారికి వివాహ వయస్సు లేకున్నాసరే : హైకోర్టు కీలక వ్యాఖ్యలుp: దగ్గు మందు తాగి ముగ్గురు చిన్నారులు మృతి

టూవీర్ నడిపేవారితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించాల్సిందేనని ట్రాఫిక్ పోలీసులు సుస్పష్టం చేశారు. ఈ సంవత్సరం ఇప్పటికి హెల్మెట్ లేకుండా ప్రయాణించేవారిపై కేసులు నమోదు చేశామని..అటువంటి వాహనదారులపై 11,54,463 కేసులు నమోదు చేసామని వెల్లడించారు. డిసెంబర్ 4 నుంచి 11 మధ్య ప్రత్యేక తనిఖీలు చేపట్టిన పోలీసులు 27,306 కేసులను నమోదు చేశారు.

టూవీలర్ వెనుక ప్రయాణిస్తున్న వ్యక్తి సైతం హెల్మెట్ పెట్టుకునేలా చూడటం అనేది వాహనం నడిపేవారిదే బాధ్యత అని తెలిపారు. వాహనం నడిపే వారితో పోలిస్తే వెనుక కూర్చున్న వారికి ప్రమాదాల్లో ఎక్కువ ప్రాణాలు కోల్పోతున్నారని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉందని సిటీ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. ప్రాణం ఎంతో విలువైనదనీ..వారి కుటుంబాలకు వారి ప్రాణాలు చాలా విలువైనవి..నిర్లక్ష్యంతో ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని సూచించారు.

Read more : Road Accident : మద్యం మత్తు.. ముగ్గురి ప్రాణాలు తీసిన లారీ డ్రైవర్.. ఛిద్రమైన చిన్నారుల శరీరాలు

ఎన్నో ప్రమాదాల్లో హెల్మెట్ ధరించిన వాహనదారుడు సురక్షితంగా బయటపడగా.. హెల్మెట్ లేక వెనుకనున్న వారు మరణించారని వెల్లడించారు. హెల్మెట్ లేకపోతే వాహనదారుడితోపాటు, వెనుక కూర్చున్న వారికి కూడా విడివిడిగా చలాన్లు విధిస్తామని ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ డీసీపీ ఎల్ఎస్ చౌహాన్ హెచ్చరించారు. వాహనంపై చిన్నపిల్లలను తీసుకెళుతుంటే వారికి కూడా హెల్మెట్ పెట్టాల్సిందిగా సూచించారు. ఇకపై హెల్మెట్ నిబందన అతిక్రమిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు.