Road Accident : మద్యం మత్తు.. ముగ్గురి ప్రాణాలు తీసిన లారీ డ్రైవర్.. ఛిద్రమైన చిన్నారుల శరీరాలు

మద్యం మత్తు ముగ్గురి ప్రాణాలు తీసింది.. మరో వ్యక్తి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. మృతుల్లో ఇద్దరు మూడేళ్ళ చిన్నారులు ఉన్నారు.

Road Accident : మద్యం మత్తు.. ముగ్గురి ప్రాణాలు తీసిన లారీ డ్రైవర్.. ఛిద్రమైన చిన్నారుల శరీరాలు

Road Accident

Updated On : December 21, 2021 / 12:22 PM IST

Road Accident : మద్యం తాగి వాహనం నడపడం నేరం.. అయితే చట్టం ప్రకారం శిక్షార్హులనే విషయం తెలిసికూడా కొందరు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఓ లారీ డ్రైవర్ ఫుటుగా మద్యం సేవించి వాహనం నడపడం వల్ల.. కుటుంబ యజమాని మినహా మిగతా ముగ్గురు మృతి చెందారు. బ్రతికున్న యజమాని ఆరోగ్యపరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

చదవండి : Road Accident : బైక్ ను ఢీకొట్టిన ఆటో..మహిళ దుర్మరణం

ప్రమాద వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని హాసన్ పట్టణానికి చెందిన శివానంద్, జ్యోతి భార్యాభర్తలు వీరికి.. మూడేళ్ళ కవల పిల్లలు ప్రణతి, ప్రణవ్ ఉన్నారు. నలుగురు కలిసి ఆదివారం అర్ధరాత్రి సమయంలో హాసన్ పట్టణ శివార్లలో బైక్‌పై వెళ్తుండగా.. ఓ లారీ వేగంగా దూసుకొచ్చి బైక్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు లారీ టైర్లకిందపడి అక్కడికక్కడే మృతి చెందారు.. వారి శరీరం లారీ టైర్ల మధ్యలో చిక్కుకోవడంతో సుమారు రెండు కిలోమీటర్లపాటు చిన్నారుల మృతదేహం మాంసపు ముద్దలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

చదవండి : Guntur Accident : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కూలీలు మృతి

ఇక ప్రమాదంలో శివానంద్, జ్యోతి దంపతులు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జ్యోతి మృతి చెందింది. శివానంద్ పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు లారీని ఛేదించి.. పారిపోతున్న డ్రైవర్ ను పట్టుకున్నారు. ఫుటుగా మద్యం సేవించి లారీ నడుపుతున్నట్లుగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.