Students Suicide : 7 ఏళ్లలో 122 మంది ఐఐటీ విద్యార్థుల ఆత్మహత్య: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

గత ఏడేళ్లలో 122 మంది ఐఐటీ విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నారని పార్లమెంట్ లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు.

Students Suicide : 7 ఏళ్లలో 122 మంది ఐఐటీ విద్యార్థుల ఆత్మహత్య: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

Students Suicide

122 IIT students commit suicide : దేశ భవిష్యత్తును బంగారు బాటలో నడిపించాల్సిన విద్యార్ధుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి అంటే చాలు విద్యార్ధుల ఆత్మహత్యల వార్తలు వింటుంటాం. అదే కాకుండా చదువులో తీవ్ర ఒత్తిడి కూడా ఆత్మహత్యలకు కారణంగా మారుతోంది. అలా ఎంతోమంది విద్యార్ధులు కన్నవారి కడుపుల్లో చిచ్చులు పెడుతున్నారు బలన్మరణాలతో. విద్యార్ధుల ఆత్మహత్యల విషయంలో పార్లమెంట్ లో కేంద్రం ప్రభుత్వం మాట్లాడుతు..గత ఏడేళ్లలో 122 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించింది.

Read more : Madhya Pradesh : నోట్ల కట్టలను విసిరేసిన వృద్ధుడు, వీడియో వైరల్

2014-2021 మధ్య కాలంలో ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్సీలు, కేంద్ర యూనివర్సిటీలు, కేంద్ర నిధులతో నడిచే విద్యాసంస్థలకు చెందిన 122 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని కేంద్రప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న ఈ 122 మంది విద్యార్ధుల్లో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు) 24 మంది, 41మంది ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ),ముగ్గురు ఎస్టీలు, ముగ్గురు మైనారిటీ వర్గాలకు చెందిన వారు ఉన్నారని తెలిపారు.

Read more : India : గుడ్ న్యూస్..వారానికి నాలుగు రోజులే పని దినాలు..కొత్త లేబర్ కోడ్!

ఆత్మహత్యలు చేసుకునేవారిలో ఎక్కువగా యూనివర్శిటీలకు చెందిన విద్యార్ధులకే ఉన్నారని ముఖ్యంగా సెంట్రల్‌ యూనివర్సిటీలకు చెందిన విద్యార్ధులే ఉన్నారని తెలిపారు. 37 మంది సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని మంత్రి తెలిపారు. ఐఐటీల్లో 34 మంది, ఐఐఎస్సీ బెంగళూరులో 9 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. కాగా బెంగళూరు, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ రీసెర్స్ (IISERS)ు చెందిన 9మంది విద్యార్ధులు 2014-21 మధ్య ఆత్మహత్యకు పాల్పడ్డారు.