India : గుడ్ న్యూస్..వారానికి నాలుగు రోజులే పని దినాలు..కొత్త లేబర్ కోడ్!

వారంలో నాలుగు రోజుల పాటు ప్రతి రోజూ 12 గంటలు పనిచేయాల్సి ఉంటుందనే నిబంధన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారినికి 48 గంటల పని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని...

India : గుడ్ న్యూస్..వారానికి నాలుగు రోజులే పని దినాలు..కొత్త లేబర్ కోడ్!

Labour

India’s New Labour Codes : వారానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పని చేసేలా కొత్త లేబర్ కోడ్ ను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వచ్చే సంవత్సరం నుంచి ఈ కొత్త కార్మిక విధానం అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కార్మిక వ్యవస్థ రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది కాబట్టి…దీనికి సంబంధించిన మార్పులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాల్సి ఉంటుంది. కానీ..వారానికి నాలుగు రోజుల పనిదినాలు అంటే…మిగతా మూడు రోజులు సెలవులో ఉండవచ్చు.

Read More : Kim Jong Un : దారుణం.. వీడియోలు చూశారని ఏడుగురికి ఉరిశిక్ష విధించిన ‘కిమ్ జోంగ్ ఉన్’

అయితే..వారంలో నాలుగు రోజుల పాటు ప్రతి రోజూ 12 గంటలు పనిచేయాల్సి ఉంటుందనే నిబంధన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారినికి 48 గంటల పని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉద్యోగి యొక్క సామాజిక భద్రత, జీతాలు, పరిశ్రమల సంబంధాలు, ఆరోగ్యం, పనిచేసే పరిస్థితులపై నాలుగు కొత్త లేబర్ కోడ్ లను కేంద్ర ప్రవేశపెట్టాలని యోచిస్తోందని సమాచారం. కొత్త లేబర్ కోడ్ అమలు అయితే..దేశంలోని ఉద్యోగులు ప్రస్తుత ఐదు రోజుల పని రోజులకు వచ్చే ఏడాది నుంచి నాలుగు రోజుల పని దినాలు చేసే అవకాశం ఉంది.