ప్రమాదకర స్థితిలో మంచునదులు..ఉత్తరాఖండ్ వంటి విషాదాలు మరిన్ని జరిగే అవకాశాలున్నాయా? పొంచి ఉన్న ప్రమాదాలేంటీ?

ప్రమాదకర స్థితిలో మంచునదులు..ఉత్తరాఖండ్ వంటి విషాదాలు మరిన్ని జరిగే అవకాశాలున్నాయా? పొంచి ఉన్న ప్రమాదాలేంటీ?

Uttarakhand Glacier Tragedy: ఉత్తరాఖండ్‌లో సంభవించిన జల ప్రళయం వందలాదిమంది ప్రాణాల్ని బలితీసుకుంది. ఈ పెను విషాదంతో ఉత్తరాఖండ్ మాత్రమే కాకు దేశం యావత్తు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హిమాలయాల్లోని హిమానీ నదం నుంచి మంచు ముక్కలు ముక్కలుగాగా మారడంతో చమోలి జిల్లాలో ధౌలిగంగ నదిలో నీటి మట్టం హఠాత్తుగా పెరిగి… వరద ప్రవాహం పోటెత్తింది. ఆ ప్రభావానికి రైనీ తపోవన్ దగ్గరున్న రుషిగంగ డ్యామ్ తెగిపోయింది. ఇవన్నీ చకచకా జరిగిపోవటం పెను విషాదం జరిగింది. పవర్ ప్రాజెక్ట్ డ్యామ్ కొట్టుకుపోవడంతో భారీగా వరద పోటెత్తి… రైనీ గ్రామం దాదాపు జలసమాధి అయిపోయింది.


నది తీరంలో ఉన్న ఇళ్లన్నీ ఈ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఆ ఉదృతికి ఇల్లు చిన్నపడవల్లా అల్లాడిపోయాయి.విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న 170 మంది సిబ్బంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు 10 మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలినవారికోసం గాలిస్తున్నారు. దీంట్లో భాగంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

హిమానీనదం అంటే…మంచు గడ్డకట్టి ఉన్న నది ఏదో ఒక సమయంలో ఆ గడ్డ కరుగుతుంది. ముక్కలవుతాయి. అటువంటి సమయంలోనే ఇటువంటి జల ప్రళయాలు సంభవిస్తాయి. నదుల్లో వరద నీటి ఉద్ధృతి కంటే… హిమానీనదం ముక్కలైనప్పుడు ఉద్ధృతి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. దాని ధాటికి జరిగి ప్రమాదాన్ని ఊహించలేం. ఊహించేలోపే జరగాల్సిన పెను ప్రమాదం జరిగిపోతుంది. ప్రాణాలు ఆ మంచులో కలిసిపోతాయి.అదే జరిగింది ఉత్తరాఖండ్ లో.

గ్లేసియర్లలో గట్టకట్టిన మంచు చాలా భారీ స్థాయిలో ఉంటుంది. ఇది చాలా నెమ్మదిగా కదులుతుంది. అది కదిలినట్లే కనిపించదు. కానీ ప్రమాదం మాత్రం ఉదృతంగా ఉంటుంది. హిమానీనదాల్లో 2 రకాలుంటాయి. ఒకటి ఆల్పైన్ గ్లేసియర్స్. అంటే ఇవి లోయల్లోని గ్లేసియర్లు లేదా పర్వతాల గ్లేసియర్లు. మరోరకం… సాధారణ ఐస్ గ్లేసియర్లు. ఇవి నదులు గడ్డకట్టినప్పుడు ఏర్పడే గ్లేసియర్లు.

ఉత్తరాఖండ్ ఘటనలో విరిగిపడిన గ్లేసియర్… పర్వత గ్లేసియర్. ఇది పర్వతాల నుంచి కరగటం ప్రారంభమై..లోయల్లోకి నెమ్మదిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇవి అత్యంత ప్రమాదకరమైన హిమానీనదాలు. ఎందుకంటే ఇవి కరిగి ముక్కలైతే…పెద్ద పెద్ద భారీ స్థాయి సైజుల్లాగా.. బండరాళ్లలా మంచు జారి కింద పడిపోతుంది. దాంతో అక్కడి నదుల్లో నీటి ప్రవాహం హఠాత్తుగా పెరిగిపోతుంది. మనం ఊహించనంత వేగంగా ప్రమాదం జరుగుతుంది.

ఉత్తరాఖండ్‌లో జరిగింది అదే. భూమిపై వేడి పెరుగుతూ ఉంటే… ఇటువంటి దారుణాలు జరుగుతుంటాయి. ఈ విషయాన్ని పర్యావరణవేత్తలు ఎప్పుటికప్పుడు హెచ్చరిస్తునే ఉన్నారు. అయినా భూతాపం తగ్గించటానికి సరైన చర్యలు తీసుకోకపోవటంతో ఇటువంటి హిమనీనదాలు కరిగి ప్రమాదాలకు దారితీస్తుంటాయి. కానీ ఇప్పటికైనా పర్యావరణవేత్తల హెచ్చరికల్ని పట్టించుకోవాలి. లేకుంటే ఇటువంటి పెను ప్రమాదాలు మరిన్ని జరుగుతాయని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం మన భూమి 10 శాతం ఈ గ్లేసియర్లతో కప్పి ఉందని నిపుణులు చెబుతుంన్నారు. భూమిలో పెరుగుతున్న వేడికి ప్రతీ ఏటా మంచు భారీస్థాయిలో కరిగిపోతోంది. ప్రతీ సంవత్సరం మంచు విపరీతంగా కురిసే ప్రాంతాల్లోనే ఈ గ్లేసియర్లు ఏర్పడతాయి.అలా మంచు కురిసినప్పుడల్లా… గ్లేసియర్ మరింత గట్టిపడుతూ… అదే ఓ పర్వతం సైజుల్లో తయారవుతుంది. కొత్తగా పడే మంచుతో వాటి సైజును మరింత పెంచుతూంటుంది.

అది కరిగి క్రమంగా పర్వతం నుంచి లోయవైపుకి దారి తీస్తుంది. ముక్కలైన మంచు కొండ బండరాళ్లలాగా అత్యంత గట్టిగా ఉంటుంది. ఈ మంచులో రాపిడి ఏర్పడినప్పుడు వాతావరణం చల్లగా ఉన్నాసరే రాపిడికి కరుగుతుంది. అదే సమయంలో ఇది ప్రవాహంలా మారుతుంది. అది అలా అలా అక్కడికి సమీపంలోని నదిలోకి గానీ లోయలోకి ప్రవహిస్తుంది. అటువంటి సమయాల్లో జరిగే ప్రళయాన్ని ఊహించలేం.

పర్వత గ్లేసియర్లు చుట్టుపక్కల లోయల్లోకి కూడా విస్తరిస్తాయి. కొన్నిసార్లు మాత్రం ఇవి లోయల దాకా వెళ్లకుండానే మంచు తుఫానులకు కారణమవుతాయి. అలా మంచు తుఫాను వచ్చిందంటే…క్షణాల్లో భూకంపంలా ఏర్పడి… పెద్ద ఎత్తున మంచు… ప్రవాహంలా లోయవైపు వేగంగా దూసుకెళ్తుంది. ఉత్తరాఖండ్ విషాదంలో భారీ ఎత్తున మంచు ప్రవహించటంతో చుట్టుపక్కలంతా విస్తరించింది.

ఆ ఉదృతికి..దాని వేగానికి ధౌలి గంగ నదిలో నీటి మట్టం చాలా వేగంగా ఊహించనంత వేగంగా పెరిగిపోయింది. ఇదంతా చకచకా జరిగిపోతుంది. చాలా వేగంగాజరగటం వల్ల ఆ పెను ఉత్పాతాన్ని ఊహించలేం. ముందే ఊహించే పరిస్థితి గానీ..తెలుసుకునే పరిస్థితి ఉండదు. అంతా చాలా వేగంగా జరిగిపోతుంది. అందువల్ల పర్వతాల దగ్గర ఉండేవారికి గ్లేసియర్లతో ఎప్పటికీ ప్రమాదం పొంచే ఉంటుంది.

అందుకే గ్లేసియర్లతో అప్రమత్తంగా ఉండాలి. ఈ హిమానీనదాల దగ్గర నది ఉంటే… ఆ చుట్టుపక్కల ప్రజలకు పెను ప్రమాదమని చెప్పాల్సిందే. అటువంటి ప్రాంతాల్లో నివాసాలు ఉండకపోవతేనే మంచిది. లేదంటే ఎప్పుడు ఏం జరుగుతుందో..ఊహించటం చాలా కష్టం.

ఎందుకంటే… గ్లేసియర్ ముక్కలైతే… ఆ మంచు ముక్కలు ఆ సమీపంలో ఉండే నదిలో కలిస్తే… నీటి ప్రవాహం ఊహంచలేనంతగా వేగంగా పెరుగుతుంది. అత్యంత ప్రమాదాలకు దారి తీస్తుంది. ఎందుకంటే… ఈ గ్లేసియర్లలో నీరు చాలా ఎక్కువగా పరిమాణంలో గడ్డకట్టి ఉంటుంది.

అటువంటి గ్లేసియర్ నదితో కలిస్తే నీటి మట్టం కొన్ని మీటర్ల ఎత్తు పెరిగిపోతుంది. భారీ ఎత్తున ఐస్ నీటిలో తేలుతూ… కరుగుతూ నీటి మట్టాన్ని మరింత పెంచుతూ ఉంటుంది. ఆ మంచుగడ్డల కదలికలకు ఆ నదీ తీరాలకు చాలా ప్రమాదం ఏర్పడుతుంది.

అటువంటి సమయాల్లోనే ఉత్తరాఖండ్ లాంటి మహా ప్రళయం సంభవిస్తాయి. ఒక్కోసారి హిమనీనదాల కరిగే స్థాయిని బట్టి ప్రమాదం ఇంకా భారీ స్థాయిల్లో ఉంటుంది. కాబట్టి గ్లేసియర్లతో ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి.

గ్రేసియర్లు పర్వతారోహకులకు కూడా ప్రమాదమే..పర్వతారోహణ చేసేవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్ని ప్రకృతి విపత్తులు సంభవించే సయమంలో ప్రమాదాలకు గురవుతుంటారు. అటువంటి ఘటనలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.