జమ్ము సెక్టార్ లో ఆరు వంతెనలను ప్రారంభించిన మంత్రి రాజ్ నాథ్ సింగ్

  • Publish Date - July 9, 2020 / 11:53 AM IST

జమ్ము సెక్టార్ లో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ వంతెనలను ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జమ్ములోని రూ.43కోట్ల ఖర్చుతో నిర్మించిన ఆరు వంతెనలను మంత్రి ప్రారంభించారు.

జమ్మూ సెక్టార్‌లో సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌వో) కొత్తగా నిర్మించిన ఆరు కొత్త వంతెనలను గురువారం (జులై9,2020) కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. ఈ వంతెనలకు రూ.43 కోట్ల వ్యయంతో ఆరు వంతెనలు నిర్మించామని అధికారులు తెలిపారు.

అఖ్నూర్ సెక్టార్‌లో నాలుగు,జమ్మూ-రాజ్ పురా ప్రాంతంలో రెండు వంతెనలను మంత్రి ఆవిష్కరించారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్‌లలో బీఆర్ఓ ద్వారా రహదారి పనులకు అదనంగా రూ.1,691 కోట్లు మంజూరు చేస్తూ కేంద్రం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.