వివాహం కాకుండా గర్భవతి అయిన ఒక యువతి చేసిన పని ఆమె ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌కు చెందిన పెళ్లి కాని యువతి(25) వివాహేతర సంబంధం కారణంగా గర్భవతి అయ్యింది. కాంపిటేటివ్ పరీక్షల కోసం చదువుకుంటున్న యువతి, గోరఖ్‌పూర్‌లో ఉంటుంది.
ఈ క్రమంలో ప్రియుడు ద్వారా గర్భం దాల్చింది. యువతి ఎవరికీ తెలియకుంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రసవం చేసుకోవాలని ప్రయత్నించింది. ఈ మేరకు ఒక గదిని అద్దెకు తీసుకుంది. ఒంటరిగా ఫోనులో వీడియో చూస్తూ ప్రసవం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆమె ప్రయత్నం వికటించింది. తీవ్ర రక్తస్రావానికి గురై ప్రాణాలు కోల్పోయింది.
ఆమె గది నుండి రక్తం బయటకు రావడాన్ని గమనించిన చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు వచ్చిన పోలీసులు గది తెరిచి చూడడంతో రక్తపు మడుగులో యువతి, పసికందు చనిపోయి ఉన్నారు. అప్పటికే ఆ యువతి కూడా చనిపోయింది.
యువతితో సంబంధం పెట్టుకున్న వ్యక్తి వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. యువతి కుటుంబ సభ్యులు కేసు పెట్టని కారణంగా.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని అక్కడి పోలీసులు తెలిపారు.