Walking with earphones: ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రైలు పట్టాల మధ్య నడక.. ముగ్గురు యువకుల మృతి

ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రైలు పట్టాలు, రోడ్డుపై నడుస్తూ యువత ప్రమాదాల బారిన పడుతున్నారు. కొందరు కనీసం వాహనాల శబ్దమైనా వినపడకుండా సౌండ్ పెట్టుకుని ఇయర్ ఫోన్స్ ద్వారా పాటలు వింటూ రైలు పట్టాలు దాటుతూ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. యువతలో పెరిగిపోతోన్న ఈ ధోరణే తాజాగా ముగ్గురి ప్రాణాలు తీసింది. ఉత్తరప్రదేశ్ లో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు మృతి చెందారు. భదోహీ రైల్వే స్టేషన్‌‌లో ఇద్దరు, అహీంపూర్ రైల్వే హాల్ట్ లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

Walking with earphones: ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రైలు పట్టాలు, రోడ్డుపై నడుస్తూ యువత ప్రమాదాల బారిన పడుతున్నారు. కొందరు కనీసం వాహనాల శబ్దమైనా వినపడకుండా సౌండ్ పెట్టుకుని ఇయర్ ఫోన్స్ ద్వారా పాటలు వింటూ రైలు పట్టాలు దాటుతూ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. యువతలో పెరిగిపోతోన్న ఈ ధోరణే తాజాగా ముగ్గురి ప్రాణాలు తీసింది. ఉత్తరప్రదేశ్ లో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు మృతి చెందారు. భదోహీ రైల్వే స్టేషన్‌‌లో ఇద్దరు, అహీంపూర్ రైల్వే హాల్ట్ లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను రైల్వే అధికారులు మీడియాకు తెలిపారు.

కృష్ణ అలియాస్ బంగాలీ (20), అతడి స్నేహితుడు మోను (18) మధ్యాహ్న భోజనం అనంతరం భదోహి రైల్వే స్టేషన్ కు సమీపంలో వాకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరూ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు. వారు పట్టాల మధ్య నుంచి నడుస్తుండగా హౌరా-లాల్కువాన్ ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకొచ్చింది. ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం కృష్ణ, మోనుకు రైలు చప్పుడు వినపడలేదు. వారిద్దరిని రైలు ఢీ కొట్టడంతో ఎగిరిపడి ప్రాణాలు కోల్పోయారు. వారిద్దరు ఇంటికి రాకపోవడంతో రైల్వే స్టేషన్ సమీపానికి వచ్చిన వారి కుటుంబ సభ్యులు మృతదేహాలను గుర్తించారు.

మరో ఘటనలో, దల్పత్పూర్ గ్రామానికి చెందిన పంకజ్ దుబే (30) అహీంపూర్ రైల్వే స్టేషన్ హాల్ట్ వద్ద వారణాసీ-అలహాబాద్ రైల్వే రైన్ పై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతడు కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడంతో ప్యాసింజర్ రైలు వస్తోన్న శబ్దాన్ని గమనించలేకపోయాడు. దీంతో అతడిపై నుంచి రైలు వెళ్ళడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

China-taiwan conflict: తైవాన్‌లో అస్థిరత తీసుకురావడానికి పనిచేస్తోన్న ఏజెంట్‌లా చైనా వ్యవహరించవద్దు: అమెరికా వార్నింగ్

ట్రెండింగ్ వార్తలు