China-taiwan conflict: తైవాన్‌లో అస్థిరత తీసుకురావడానికి పనిచేస్తోన్న ఏజెంట్‌లా చైనా వ్యవహరించవద్దు: అమెరికా వార్నింగ్

తైవాన్ విషయంలో దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న చైనాకు అమెరికా మరోసారి వార్నింగ్ ఇచ్చింది. చైనాలోని అమెరికా రాయబారి నికోలస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తైవాన్‌లో అస్థిరతను తీసుకురావడానికి పనిచేస్తోన్న ఏజెంట్‌లా చైనా వ్యవహరించవద్దని అన్నారు. ఈ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొందని, దాన్ని తగ్గించేలా చైనా వ్యవహరించాలని చెప్పారు.

China-taiwan conflict: తైవాన్‌లో అస్థిరత తీసుకురావడానికి పనిచేస్తోన్న ఏజెంట్‌లా చైనా వ్యవహరించవద్దు: అమెరికా వార్నింగ్

China-taiwan conflict

China-taiwan conflict: తైవాన్ విషయంలో దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న చైనాకు అమెరికా మరోసారి వార్నింగ్ ఇచ్చింది. చైనాలోని అమెరికా రాయబారి నికోలస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తైవాన్‌లో అస్థిరతను తీసుకురావడానికి పనిచేస్తోన్న ఏజెంట్‌లా చైనా వ్యవహరించవద్దని అన్నారు. ఈ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొందని, దాన్ని తగ్గించేలా చైనా వ్యవహరించాలని చెప్పారు. తైవాన్ లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ పర్యటించడం వల్ల చైనా-అమెరికా మధ్య సత్సంబంధాలు దెబ్బతింటాయని తాము భావించట్లేదని అన్నారు.

అయితే, చైనా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సంక్షోభాన్ని సృష్టించేలా వ్యవహరిస్తోందని చెప్పారు. చైనా అతిగా స్పందిస్తోందని అన్నారు. శాంతి కోసం కృషి చేస్తానని ప్రపంచానికి చైనా ప్రభుత్వం హామీ ఇవ్వాలని చెప్పారు. కాగా, తైవాన్ లో నాన్సీ ఫెలోసీ పర్యటించిన అనంతరం అమెరికా-చైనా మధ్య సత్సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. వన్ చైనా పాలసీకి అమెరికా ప్రభుత్వం వ్యతిరేకం కాదని, అయితే, తైైవాన్ తమ భూభాగం అని చెప్పుకుంటున్న చైనా చర్యలకు తాము ఎన్నడూ మద్దతు తెలపలేదని అన్నారు.

కాగా, తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలు చేస్తూ గత కొంత కాలంగా చైనా దుందుడుకు చర్యలకు పాల్పుడుతుండడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇటువంటి చర్యలకు పాల్పడి యుద్ధ వాతావారణాన్ని సృష్టించవద్దని ఇప్పటికే చైనాను అమెరికా పలుసార్లు హెచ్చరించింది. అయినప్పటికీ చైనా తన తీరు మార్చుకోవట్లేదు. చైనా దాడి చేస్తే తిప్పికొట్టేందుకు తైవాన్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.

China-taiwan conflict: తైవాన్ చుట్టూ చైనాకు చెందిన 21 యుద్ధ విమానాలు, 5 నౌకలు