China-taiwan conflict: తైవాన్ చుట్టూ చైనాకు చెందిన 21 యుద్ధ విమానాలు, 5 నౌకలు

చైనా-తైవాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. తమ దేశం చుట్టూ చైనాకు చెందిన 21 యుద్ధ విమానాలు, 5 నౌకలను తాము గుర్తించినట్లు తైవాన్ రక్షణ శాఖ ప్రకటించింది. వాటిలో ఎనిమిది యుద్ధ విమానాలు తైవాన్ జలసంధి మధ్యస్థ రేఖను దాటినట్లు పేర్కొంది. వాటిలో జియాన్ జేహెచ్-7 ఫైటర్-బాంబర్లు, సుఖోయ్ ఎస్యూ-30 యుద్ధ విమానాలు, షెన్యాంగ్ జే-11 జెట్లు ఉన్నట్లు తెలిపింది. చైనా చర్యలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ, తిప్పికొట్టేందుకు తాము అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు చెప్పింది.

China-taiwan conflict: తైవాన్ చుట్టూ చైనాకు చెందిన 21 యుద్ధ విమానాలు, 5 నౌకలు

China-taiwan conflict

China-taiwan conflict: చైనా-తైవాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. తమ దేశం చుట్టూ చైనాకు చెందిన 21 యుద్ధ విమానాలు, 5 నౌకలను తాము గుర్తించినట్లు తైవాన్ రక్షణ శాఖ ప్రకటించింది. వాటిలో ఎనిమిది యుద్ధ విమానాలు తైవాన్ జలసంధి మధ్యస్థ రేఖను దాటినట్లు పేర్కొంది. వాటిలో జియాన్ జేహెచ్-7 ఫైటర్-బాంబర్లు, సుఖోయ్ ఎస్యూ-30 యుద్ధ విమానాలు, షెన్యాంగ్ జే-11 జెట్లు ఉన్నట్లు తెలిపింది. చైనా చర్యలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ, తిప్పికొట్టేందుకు తాము అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు చెప్పింది.

తైవాన్ లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ ఇటీవల పర్యటించడంతో ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే. అంతేగాక, ఆమె పర్యటన అనంతరం కొన్ని రోజులకే యూఎస్ కాంగ్రెస్ సభ్యుల బృందం నిన్న తైవాన్‌లో పర్యటించింది. దీంతో తైవాన్ చుట్టూ చైనా మరోసారి యుద్ధ విన్యాసాలు చేపట్టింది. తైవాన్ తమ భూభాగమని చైనా వాదిస్తోంది. దీంతో చైనా ఒకవేళ దాడి చేస్తే తిప్పికొట్టడానికి తైవాన్ అన్ని సిద్ధమవుతోంది.

మరోవైపు తైవాన్ తో పలు ఒప్పందాలు చేసుకుంటూ చైనాకు అమెరికా మరింత అసహనం తెప్పిస్తోంది. తైవాన్ కు ఇప్పటికే అమెరికా భారీగా సాయాన్ని అందిస్తోంది. చైనా పాల్పడుతోన్న చర్యలు సరికాదని అమెరికా ఇప్పటికే పలుసార్లు హెచ్చరించింది. అయినప్పటికీ తైవాన్ విషయంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది. సైనిక విన్యాసాలు చేపడుతూ తైవాన్ ను హెచ్చరించే ప్రయత్నం చేస్తోంది.

Non-bailable warrant against Nithyananda: ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామిజీకి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌