Licences Of Lawyers: మోసానికి పాల్పడ్డ లాయర్లపై చర్యలకు దిగింది ఉత్తర ప్రదేశ్ బార్ కౌన్సిల్. 30 మంది లాయర్ల లైసెన్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మోటార్ వెహికిల్స్ ప్రమాదానికి గురైనా, దొంగిలించుకుపోయినా ఇన్సూరెన్స్ ఉంటే నిబంధనల ప్రకారం క్లెయిమ్ చేసుకోవచ్చనే సంగతి తెలిసిందే.
Sundar Pichai: ఆ మూడు ఓవర్లు కూడా చూశా.. నెటిజన్‌కు అద్దిరిపోయే రిప్లై ఇచ్చిన సుందర్ పిచాయ్
ఈ విషయంలో లాయర్ల పాత్ర కీలకం. వారి వాదనలు, సిఫారసుల అనుగుణంగానే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఈ విషయంలో కొందరు లాయర్లు మోసానికి పాల్పడ్డారు. నకిలీ క్లెయిమ్స్ ద్వారా ఇన్సూరెన్స్ పొందారు. నకిలీ పత్రాలు సృష్టించి, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ నుంచి అక్రమంగా ఇన్సూరెన్స్ ఇప్పించారు. మొత్తం 30 మంది లాయర్లు ఈ పని చేశారు. వీరికి కొందరు పోలీసులు కూడా సహకరించారు. నకిలీ క్లెయిమ్స్ కారణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు కోట్ల రూపాయలు నష్టపోయాయి. దీంతో ఆ సంస్థలు విచారణ జరపగా అసలు మోసం బయటపడింది.
దీనిపై కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించింది. దాదాపు 30 మంది లాయర్లు ఈ మోసానికి పాల్పడ్డట్లు గుర్తించింది. మీరట్, బరేలి, షాజహాన్ నగర్‌కు చెందిన లాయర్లు నకిలీ పత్రాలతో మోసానికి పాల్పడ్డట్లు తేలింది. దీంతో ఈ మోసానికి పాల్పడ్డ 30 మంది లాయర్ల లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ఉత్తర ప్రదేశ్ బార్ కౌన్సిల్ ప్రకటించింది.