UP Cabinet Expansion : యూపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్!

వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచి సత్తా చూపెట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే

Up

UP Cabinet Expansion వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచి సత్తా చూపెట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రివర్గ విస్తరణలో యూపీకి అధిక ప్రాధాన్యత కల్పించింది. తాజాగా యూపీ కేబినెట్‌ విస్తరణపై బీజేపీ దృష్టి పెట్టింది.

సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మంత్రివర్గంలోకి కొత్తగా ఏడుగురు చేరుతున్నట్టు తెలుస్తోంది. ఇవాళ(సెప్టెంబర్-26,2021)సాయంత్రం 5:30గంటలకు లక్నోలోని రాజ్ భవన్ లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయనున్నవారిలో సంగీతా బింద్‌, జితిన్‌ ప్రసాద, చత్రాపాల్‌ గ్యాంగ్వార్‌, దినేష్‌ ఖటిక్‌, కృష్ణ పాశ్వాన్‌ ఉన్నట్లు సమాచారం.

ALSO READ  బీజేపీ అంటే భారతీయ జనకంటక పార్టీ : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ తన మిత్రపక్షాలతో ఎలా వ్యవహరించాలని ఇష్టపడుతుందో కూడా ఈ విస్తరణలో కనిపిస్తోందని పార్టీ నేతలు తెలిపారు. అప్నా దళ్ (సోనేలాల్) , నిషాద్ పార్టీల నుండి నాయకులకు యోగి మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశముందని తెలిపారు. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో 53 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో 23 మంది కేబినెట్ మంత్రులు, తొమ్మిది మంది రాష్ట్ర మంత్రులు (స్వతంత్ర బాధ్యతలు), 21 మంది రాష్ట్ర మంత్రులు ఉన్నారు.

కాగా,వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అప్నాదళ్, నిషద్ పార్టీలతో కలిసి పోటీలోకి దిగుతున్నట్లు బీజేపీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.