Jeevan Reddy : బీజేపీ అంటే భారతీయ జనకంటక పార్టీ : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

బీజేపీ నేతలపై తీరుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ అంటే భారతీయ జన కంటక పార్టీ అని అభివర్ణించారు. అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ బీజేపీ అని విమర్శించారు.

Jeevan Reddy : బీజేపీ అంటే భారతీయ జనకంటక పార్టీ : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

Jeevan Reddy

Updated On : September 26, 2021 / 1:19 PM IST

Jeevan Reddy fired BJP : బీజేపీ నేతలపై తీరుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ అంటే భారతీయ జన కంటక పార్టీ అని అభివర్ణించారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ బీజేపీ అని విమర్శించారు. క్రీడాకారులకు ప్రోత్సహకాలు ఇవ్వడం లేదని అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.

కళ్లున్నా చూడలేని స్థితిలో బీజేపీ నేతులు ఉన్నారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రభుత్వ ఆస్తులను అమ్ముతుందని చెప్పారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తానన్న మోడీ మాట తప్పారని విమర్శించారు. రఘునందన్ రావు మేధావిలా ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు.

Hyderabad : మణికొండలో వరదనీటిలో వ్యక్తి గల్లంతు

సీఎం కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో స్టేడియాలు నిర్మస్తున్నారని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు.

బీజేపీ నేతలు అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తప్పుడు మాటలు మాట్లాడటం మానుకోవాలని హితవుపలికారు. మోడీ సొంతం రాష్ట్ర గుజరాత్ లో రూ.200 పింఛన్ ఇస్తే, తెలంగాణలో రూ.2 వేలు ఇస్తున్నామని తెలిపారు.