UP CM Yogi Adityanath
Yogi Adityanath Death Threat: మహారాష్ట్రంలోని ముంబై పోలీసులకు బెదిరింపు సందేశం వచ్చింది. అందులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రస్తావన ఉంది. ఈ సందేశం ద్వారా సీఎం యోగి ఆదిత్యనాథ్ కు హత్య బెదిరింపులు వచ్చాయి. మెసేజ్ అందుకున్న తరువాత మహారాష్ట్ర పోలీసులు యాక్టివ్ అయ్యి మెసేజ్ పంపిన వ్యక్తికోసం వెతుకులాట ప్రారంభించారు. వాస్తవానికి, ముంబైలోని ట్రాఫిక్ కంట్రోల్ సెల్ కు తెలియని నంబర్ నుండి ‘యోగి ఆదిత్యనాథ్ పది రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేయకపోతే బాబా సిద్ధిఖీలా చంపేస్తాం’ అని రాసిఉంది. ఈ మెస్సేజ్ శనివారం సాయంత్రం పోలీసులకు అందినట్లు తెలుస్తోంది. మెస్సేజ్ రాగానే ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. దర్యాప్తు వేగవంతం చేశారు.
Also Read: పాణ్యంలో రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా.. టీడీపీ నేతపై హత్యాయత్నం..
యోగి ఆదిత్యనాథ్ కు గతంలోనూ బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాదిలో అనేక సార్లు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి బెదిరింపులకు పాల్పడిన వారిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. కొన్నిసార్లు ఈ బెదిరింపులు ఫేస్ బుక్, ట్విటర్ ద్వారా, కొన్నిసార్లు పోలీసులకు మెస్సేజ్ ల ద్వారా అందాయి. సోషల్ మీడియా ద్వారా సీఎం యోగి ఆదిత్యనాథ్ ను చంపుతామని బెదిరించిన ఉత్తరప్రదేశ్, ముంబై, బీహార్ ల నుంచి పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇదిలాఉంటే.. గత నెలలో మహారాష్ట్ర ఎన్సీపీ పవార్ వర్గం నేత బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆ తరువాత నుంచి పలువురికి లారెన్స్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. సిద్ధిఖీ కుమారుడు జీశాన్ కూడా హిట్ లిస్ట్ లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే అతడికి కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి.