Uttar Pradesh Politics : ఢిల్లీలో యోగి మార్క్, నాయకత్వ మార్పులేనట్లే ?

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు ఉంటుందా ? కేబినెట్‌‌లో మార్పులు..చేర్పులు చేస్తారని తొలుత ఫుల్ ప్రచారం జరిగింది. ఈ క్రమంలో..సీఎం యోగి ఢిల్లీ పర్యటనకు వెళ్లడం మరిన్ని పుకార్లు షికారు చేశాయి. కానీ..ఆయన పర్యటనతో నాయకత్వ మార్పు లేనట్లేనని తేలిపోయింది.

UP CM Yogi Adityanath : ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు ఉంటుందా ? కేబినెట్‌‌లో మార్పులు..చేర్పులు చేస్తారని తొలుత ఫుల్ ప్రచారం జరిగింది. ఈ క్రమంలో..సీఎం యోగి ఢిల్లీ పర్యటనకు వెళ్లడం మరిన్ని పుకార్లు షికారు చేశాయి. కానీ..ఆయన పర్యటనతో నాయకత్వ మార్పు లేనట్లేనని తేలిపోయింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సమావేశమయ్యారు. వీరి భేటీ దాదాపు 80 నిముషాల పాటు జరిగింది. వచ్చే ఏడాది యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, మంత్రివర్గ విస్తరణపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.

యోగీ పర్యటనపై అధికారికంగా పార్టీ తరపున ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మంత్రివర్గంలో బ్రాహ్మణ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీజేపీలోకి చేరిన జితిన్‌ ప్రసాదకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం కనిపిస్తోంది. యోగి ఆదిత్యనాథ్ బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డాను కూడా కలుసుకున్నారు. యూపీలో పార్టీ బలోపేతం, తదితర అంశాలపై చర్చించారు. మోదీ, అమిత్‌షా. నడ్డాల ముందు యోగి తన వైఖరిని స్పష్టంగా వెల్లడించినట్లు తెలుస్తోంది. గురువారం అమిత్‌షాతో సుమారు 90 నిమిషాలపాటు యోగి భేటి అయ్యారు. మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై యోగి తనదైన ముద్రనే ఉండాలని పట్టుబట్టిన‌ట్లు సమాచారం.

బ్రాహ్మణ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌ను దృష్టిలో పెట్టుకుని జితిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారని, దీన్ని ఎంతమాత్రం సమర్థించేది లేదని యోగి తేల్చి చెప్పినట్లు, ఎస్పీని నిలువరించేందుకు ముస్లింలకు సీట్లు ఇవ్వాలన్న ప్రతిపాదనను కూడా యోగి తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల వ్యూహంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. రాజకీయ పొత్తులు, కులాల సమీకరణ, కేంద్ర పథకాల అమలు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఎన్నికల కోసం ప్రత్యేకంగా రోడ్‌మ్యాప్‌ రూపొందించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా యోగి ఫేస్‌తోనే బీజేపీ ముందుకు వెళ్లనుందని తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.

Read More : Virbhadra Singh : మాజీ సీఎంకి 2 నెలల్లో రెండోసారి కరోనా

ట్రెండింగ్ వార్తలు