CM Yogi Adityanath Sister : చిన్న టీకొట్టుతో యూపీ సీఎం యోగీ సోదరి జీవనం ..

తమ్ముడు ఓ పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అక్క మాత్రం ఓ మారుమూల ప్రాంతంలో ఓ చిన్న టీ కొట్టు పెట్టుకుని పర్యాటకుల వచ్చి టీ తాగి వెళితే ఆ వచ్చిన అరాకొరా ఆదాయంతో జీవనం సాగిస్తోంది. ఆ తమ్ముడు ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆధిత్యానాథ్. ఆ అక్కడ శశిపాయల్. వారి చిన్ననాటి అనుభవాల గురించి ఆ అక్క చెబుతున్న ఆసక్తికర విషయాలు..

UP CM Yogi Adityanath Sister Tea shop

UP CM Yogi Adityanath Sister Tea shop : సోదరుడు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కానీ ఆయన సోదరి మాత్రం ఓ మారుమూల ప్రాంతంలో ఓ చిన్న టీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తోంది. ఆ సోదరుడు మరెవరో కాదు ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)సీఎం యోగీ ఆదిత్యానాథ్(CM Yogi Adityanath). ఆయన సోదరి (అక్క) శశి పాయల్ (CM Yogi Sister Shashi Payal)మాత్రం అత్యంత నిరాడంబరంగా ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని ఫౌరి (Pauri District)లో ఓ చిన్న టీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. కొంచె వర్షం పడినా ఫౌరి ప్రాంతానికి వెళ్లటం చాలా కష్టం. రెండు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను ఆపి కాలి నడకనే వెళ్లాల్సి ఉంటుంది.

అటువంటి ప్రాంతంలో మాతా భవనేశ్వరి ఆలయం (Mata Bhavaneshwari Temple)సమీపంలోని ఓ చిన్న టీ కొట్టు (Tea Shop)పెట్టుకుని దానిపై వచ్చే అరాకొరా ఆదాయంతో జీవిస్తున్నారు యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ సోదరి శశి పాయల్(Shashi Payal). ఆమె యూపీ సీఎం అక్క అని తెలిసి పర్యాటకకు ఎంతో ఆశ్చర్యపోతున్నారు. సీఎం అక్క అయి ఉండీ ఎందుకిలా జీవిస్తున్నారు? అని ప్రశ్నిస్తే చిన్న చిరునవ్వే సమాధానంగా వస్తుంది ఆమెనుంచి. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రానికి సీఎం అయిన అన్న ఉండీ ఇదేమీ జీవితం అని ఆమె గురించి తెలిసివారు అడుగుతుంటారు.

యూపీ మాజీ ఎమ్మెల్యే దినేశ్ చౌదరి ఓ సారి ఆ ప్రాంతానికి వెళ్లిన క్రమంలో ఆమె గురించి తెలుసుకున్నారు. ఆమె యోగీ సోదరి అని తెలిసి ఆమెను వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో అది వైరల్ అవుతోంది. ఆమెను యోగీ గురించి..మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవారు అంటూ అడిగారు.వారి చిన్ననాటి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.

CM yogi adityanath : 28 ఏళ్లకు సొంతూరికొచ్చి..తల్లి ఆశీస్సులు తీసుకున్న సీఎం యోగీ ఆదిత్యానాథ్

ఫౌరిలోని పంచూర్ గ్రామంలో జన్మించిన యోగీకి ఏడుగురు తోబుట్టువులు. వారిలో శశి పాయల్ అందరికంటే పెద్దవారు. యోగీ వారి తల్లిదండ్రులకు ఐదవ సంతానం. 1994లో యోగి సన్యాసం తీసుకున్నారు. ఆయన చెల్లెలు శశి కొఠార్ గ్రామానికి చెందిన పురాన్‌సింగ్‌ను వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. రక్షాబంధన్ రోజున ప్రతి ఏటా తన సోదరుడికి రాఖీ పంపిస్తుంటానని శశి తెలిపారు. తన సోదరుడు సీఎం అయినంత మాత్రాన తాము కూడా దర్జాగా జీవించాలని లేదు కదా..సీఎం అయింది నా సోదరుడు మేము కాదు కదా అంటూ అదో సాధారణ విషయంలో చెప్పారట శశి.

కాగా సీఎం యోగీ యూపీ సీఎం అయిన తరువాత ఒకే ఒక్కసారి తల్లి వద్దకు వెళ్లారు. ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. యోగీ 28 ఏళ్ల తరువాత సొంత గ్రామం అయిన ఫౌరి జిల్లాలోని తల్లిని వద్దకు పంచూర్‌ వచ్చారు. సీఎం అయిన ఐదేళ్లకు తల్లి వద్దకు వచ్చి ఆశీస్సులు తీసుకున్నారు. ఎంతో కాలం తరువాత కుమారుడికి చూసిన ఆ మాతృమూర్తి హృదయం ఉప్పొంగిపోయింది. ఇన్నాళ్టికి బిడ్డ కనిపించాడనే ఆనందం ఆమె మొహంలో కనిపించింది. చిరునవ్వులు నవ్వుతూ కొడుకుని మనసారా దీవించారు. అమ్మ దీవెనలతో యోగి కూడా ఆనందంతో పొంగిపోయారు. 2022లో మే నెలలో యోగీ తల్లిని కలిసి ఆశీస్సులు తీసుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి.

CM Yogi Adityanath : గ్యాంగ్‌‍స్టర్ అతీక్ అహ్మద్ కబ్జా చేసిన భూముల్లో ఇళ్లు నిర్మించి పేదలకు పంచిన సీఎం యోగి