Faizabad Railway Station : ఫైజాబాద్ రైల్వే‌స్టేషన్ పేరు ఇకనుంచి అయోధ్య కంటోన్మెంట్

ఉత్తర‌ప్రదేశ్ లోని ఫైజాబాద్ రైల్వే స్టేషన్ పేరును అయోధ్య కంటోన్మెంట్ స్టేషన్ గా మార్చనున్నారు. 

Faizabad Railway Station :  ఉత్తర‌ప్రదేశ్ లోని ఫైజాబాద్ రైల్వే స్టేషన్ పేరును అయోధ్య కంటోన్మెంట్ స్టేషన్ గా మార్చనున్నారు.  ఇంతకు ముందు  2018 లో ఫైజాబాద్ నగరం పేరును అయోధ్యగా  మార్చిన యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ ఇప్పుడు రైల్వే స్టేషన్ పేరు మార్చే పనిలో ఉన్నారు.

యోగీ ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయానికి  కేంద్రం కూడా ఆమోద ముద్ర వేయటంతో   యోగీ సర్కార్ రైల్వే స్టేషన్ పేరు మార్చేందుకు నోటిఫికేషన్ జారీ చేయనుంది.  యోగీ ఆదిత్యనాధ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యూపీ లోని అలహాబాద్ రైల్వే‌స్టేషన్‌ను ప్రయాగ్‌రాజ్ గాను, ముగల్ సరాయ్ రైల్వే‌స్టేషన్‌ను పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జంక్షన్లుగా మార్చింది.

Read Also : Illicit Affair : అతనికి 20, ఆమెకు 25 ఏళ్లు, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను….

ఇటీవల ఉత్తర ప్రదేశ్ లోని అనేక సంస్ధలు ఇతర జిల్లాల పేర్లను కూడా మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి. వీటిలో అజంగఢ్ ను ఆర్యగఢ్ అని, అలీఘర్ ను హరిగఢ్ , ఆగ్రాను అగ్రవన్ అని మార్చాలని డిమాండ్లు వస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు