Illicit Affair : అతనికి 20, ఆమెకు 25 ఏళ్లు, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను….

భర్త బంధువుతో  వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య  తమకు అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను తుదముట్టించిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

Illicit Affair : అతనికి 20, ఆమెకు 25 ఏళ్లు, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను….

Extra Marital Affair

Updated On : October 24, 2021 / 12:42 PM IST

Illicit Affair : భర్త బంధువుతో  వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య  తమకు అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను తుదముట్టించిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. కృష్ణగిరి జిల్లా, కెలమంగళానికి  చెందిన ఉనిసెట్టి గ్రామంలో అయ్యప్ప(37) భార్య రూప(25) ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు.  అయ్యప్ప టెంపో డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

అయప్ప జవుళగిరి సమీపంలోని మంచుగిరి గ్రామంలో నివసిస్తున్నరోజుల్లో అతని బంధువైన తంగమణి(20)కి రూపకి  వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆతర్వాత అక్కడి నుంచి అయ్యప్ప ఉనిసెట్టి గ్రామానికి మారాడు. అయినప్పటికీ రూప, తంగమణి మధ్య బంధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో మూడు నెలల క్రితం ఇద్దరూ ఇళ్లనుంచి వెళ్లిపోయారు. 10 రోజుల క్రితం బంధువులు వారిని వెతికి తీసుకువచ్చి ఎవరింటికి వారిని పంపించారు.

భార్య వెళ్లిపోయిన సంగతి ఊళ్లో అందరికీ తెలిసిపోయిందనే మనస్తాపంతో అయ్యప్ప రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.  అయినా ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదే అదనుగా భావించిన రూప ప్రియుడు తంగమణితో కలిసి భర్త హత్యకు ప్లాన్ వేసింది.

Also Read : Chinese Millionaire : చిన్న కారణానికి బ్యాంకు సిబ్బందికి చుక్కలు చూపించిన బిలియనీర్

అక్టోబర్ 22 శుక్రవారం రాత్రి ఇంట్లో   నిద్రిస్తున్న భర్త అయ్యప్పను   రూప,తంగమణి ఇద్దరూ కల్సి గొంతు పిసికి చంపేశారు.  తెల్లారాక   భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఊరంతా   ప్రచారం  చేసి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయబోయింది.  అనుమానం వచ్చిన బంధువులు రూప, తంగమణిలపై పోలీసులకు పిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు రూప, తంగమణిలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా…తామే నేరం చేసినట్లు ఒప్పుకున్నారు.  దీంతో వారిని పోలీసులు జైలుకు పంపారు. తండ్రి హత్యకు గురికావటం, తల్లి జైలు పాలు కావటంతో ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు.