Yogi Adityanath: గీతదాటొద్దు.. మంత్రులు, అధికారులకు యూపీ సీఎం యోగి కీలక ఆదేశాలు..

ఉత్తర‌ప్రదేశ్‌లో రెండవ సారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ తన దూకుడును మరింత పెంచేశారు. యూపీలో రౌడీమూకలపై ఉక్కుపాదం మోపడంద్వారా ప్రజలచేత ప్రశంసలు పొందిన యోగి..

Yogi Adithya Nath

Yogi Adityanath: ఉత్తర‌ప్రదేశ్‌లో రెండవ సారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ తన దూకుడును మరింత పెంచేశారు. యూపీలో రౌడీమూకలపై ఉక్కుపాదం మోపడంద్వారా ప్రజలచేత ప్రశంసలు పొందిన యోగి.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రజలకు మెరుగైన పాలన అందించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న ఆధిత్యనాథ్.. తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యోగులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా బుధవారం మంత్రులు, అధికారులు, ఉద్యోగులకు యోగి కీలక ఆదేశాలు జారీ చేశారు.

Yogi Adityanath Oath : రెండోసారి యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం

ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో మంత్రులు ప్రైవేట్ హోటల్స్‌లో విశ్రాంతి తీసుకోవటం కామనే. ఇక నుంచి యూపీలో అలాంటి వాటికి స్వస్తి చెప్పాలని సహచర మంత్రులకు యోగి ఆధిత్యనాథ్ సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లిన సమయంలో ప్రభుత్వ అతిథి గృహాల్లోనే బస చేయాలని ఆదేశించారు. ఇది అధికారుకూ వర్తిస్తుందని యోగి సూచించినట్లు తెలుస్తుంది. అంతేకాదు.. తమ వ్యక్తిగత కార్యదర్శులుగా బంధువులను నియమించుకోవద్దని ఆదేశించారట. యోగి కీలక నిర్ణయాలు యూపీలో చర్చనీయాంశంగా మారాయి.

Yogi Adityanath : యూపీలో హింసకు తావు లేదు : యోగి ఆదిత్యనాథ్‌

ఇదిలాఉంటే యోగి ఆధిత్యనాథ్ అధికారులు, ఉద్యోగులకు పలు ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని, పని పట్ల నిర్లక్ష్యం వహించొద్దని, మూడ్రోజులకు మించి ఏ ఫైలూ పెండింగ్ లో ఉండొద్దని సీఎం స్పష్టమైన ఆదేశాలు జరీ చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు మధ్యాహ్న భోజన విరామ సమయం 30 నిమిషాలకు మించకుండా చూసుకోవాలని ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ పేర్కొన్నట్లు ఓ అధికారి తెలిపారు. సీఎం యోగి ఆధిత్యనాథ్ ఇలాంటి ఆదేశాలు చేయడం యూపీ ప్రజలకు కొత్తేమీ కాకపోయినా.. కొందరు అధికారులు, ఉద్యోగులు యోగి ఆదేశాలతో తలలు పట్టుకుంటున్నారట.