Uttar Pradesh: అందరూ ఎంతగానో ఎదరుచూస్తున్న అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవం జనవరి 22న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజున రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. అంతేకాదు.. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండబోవని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
ఈ నెల22న అన్ని ప్రభుత్వ భవనాలను అలంకరించడంతో పాటు బాణా సంచా కాల్చి వేడుకలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అయోధ్యలో జనవరి 14 నుంచి పరిశుభ్రతపై ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. పవిత్రోత్సవ వేడుకల సన్నాహకాల్లో భాగంగా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యతను వివరించి చెప్పారు. ఇక వేడుకను చూసేందుకు తరలివచ్చే వీవీఐపీల విశ్రాంతి స్థలాలను ముందుగానే నిర్ణయించాలని, వేడుకలను సజావుగా వ్యవస్థీకృతంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ నెల 22న మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు అయోధ్య రామమందిరంలోని గర్భగుడిలో సీతాంజనేయలక్ష్మణ సమేత శ్రీరాముడు కొలువుతీరనున్నాడు. ప్రధాని నరేంద్రమోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఆహ్వానం అందినవారు మాత్రమే అయోధ్యకు రావాలని ఇప్పటికే శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోరింది. వివిధ రంగాలకు చెందిన దాదాపు 7వేల ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి.
श्री अयोध्या धाम में श्री रामलला के नवीन विग्रह की प्राण-प्रतिष्ठा संपूर्ण राष्ट्र के लिए ‘राष्ट्रीय उत्सव’ है। शताब्दियों की प्रतीक्षा के पश्चात यह शुभ बेला आई है। इस उपलक्ष्य में सभी सरकारी भवनों को दिव्य स्वरूप में सजाया जाए।
इस शुभ अवसर पर आगामी 22 जनवरी को उत्तर प्रदेश के… pic.twitter.com/NABDKQmC4l
— Yogi Adityanath (@myogiadityanath) January 9, 2024