Maldives-Lakshadweep Issue : భారత్ – మాల్దీవుల వివాదం వేళ.. భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన చైనా.. ఇజ్రాయెల్ అభ్యర్థన ఇదే..

మాల్దీవులు, భారత్ మధ్య నెలకొన్న వివాదంపై ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం తన సోషల్ మీడియా సైట్ లో #Exploreindianlslands ట్యాగ్ తో లక్షద్వీప్ చిత్రాలను షేర్ చేసింది.

Maldives-Lakshadweep Issue : భారత్ – మాల్దీవుల వివాదం వేళ.. భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన చైనా.. ఇజ్రాయెల్ అభ్యర్థన ఇదే..

Maldives-Lakshadweep Issue

Updated On : January 9, 2024 / 1:41 PM IST

Maldives : భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన తరువాత.. ప్రధాని మోదీ, లక్షద్వీప్ పరిసరాలపై మాల్దీవుల మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విబేధాలు నెలకొన్న విషయం తెలిసిందే. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలను నిరసిస్తూ ఇప్పటికే పలువురు సినీ, వివిధ రంగాల ప్రముఖులు బాయ్ కాట్ మాల్దీవ్స్ పేరుతో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ క్రమంలో వేల సంఖ్యలో మాల్దీవ్స్ వెళ్లే భారతీయులు తమ బుక్సింగ్ రద్దు చేసుకున్నారు. ఆ దేశానికి ప్లైట్ బుకింగ్స్ నిలిపివేస్తున్నట్లు దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్ మైట్రిప్ వెల్లడించింది. మాల్దీవ్స్ కు పోటీగా చలో లక్షద్వీప్ హ్యాష్ ట్యాగ్ ను జోడించింది.

Also Read : #BoycottMaldives : బాయ్‌కాట్ మాల్దీవ్స్‌.. ఇండియాలో ఇప్పుడిదే ట్రెండింగ్ ఇష్యూ.. రంగంలోకి సెలబ్రిటీలు

భారత్ నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురుకావటంతో మాల్దీవుల ప్రభుత్వం కాస్త వెనక్కుతగ్గింది. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులపై అక్కడి ప్రభుత్వం వేటు వేసింది. సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు పెట్టిన వారిని పదవి నుంచి తప్పించినట్లు మాల్దీవుల విదేశాంగ మంత్రి వెల్లడించారు. భారత్ లోని మాల్దీవుల రాయబారికి కేంద్రం సమన్లు ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా చైనా.. భారత్ పై తన అక్కస్సు వెళ్లగక్కింది. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ సంపాదకీయంలో ఈ విషయాన్ని ప్రచురించింది. ఒకవైపు మాల్దీవులకు ఢిల్లీకి దూరంగా ఉండాలని మేము ఎన్నడూ చెప్పలేదంటూనే.. చైనాను నిందించడం భారత్ మానుకోవాలంటూ వ్యాఖ్యలు చేసింది.

Also Read : Maldives Trips: మాల్దీవుల ట్రిప్‌లను రద్దు చేసుకుంటున్న భారతీయులు.. మీరు వెళ్తున్నారా?

మాల్దీవులను మేం ఎప్పటికీ సమాన భాగస్వామిగా పరిగణిస్తాం. దాని సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం. భారత్, చైనా మధ్య ఘర్షణల కారణంగా ఢిల్లీకి దూరంగా ఉండాలని మాల్దీవులకు ఎన్నడూ చెప్పలేదని చైనా అధికారిక పత్రిక సంపాదకీయంలో పేర్కొంది. మాల్దీవులకు భారత్ నుంచి వచ్చే సహకారాన్ని ముప్పుగా భావించలేదు. దక్షిణాసియాలో కొన్ని దేశాలతో ఢిల్లీ సంబంధాలు దెబ్బతిన్నాయి. దానికి చైనాను నిందించడం మానుకోవాలని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ తన సంపాదకీయంలో పేర్కొంది. భారత్ మరింత విశాల దృక్పథంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని చైనా భారత్ పై తన అక్కస్సు వెళ్లగక్కింది. అయితే, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు చైనాలో పర్యటిస్తున్న వేళ ఈ కథనం రావడం గమనార్హం.

మరోవైపు మాల్దీవులు, భారత్ మధ్య నెలకొన్న వివాదంపై ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం తన సోషల్ మీడియా సైట్ లో #Exploreindianlslands ట్యాగ్ తో లక్షద్వీప్ చిత్రాలను షేర్ చేసింది. అద్భుతమైన ఆకర్షణ కలిగిన లక్షద్వీప్ దీవులను సందర్శించాలని కోరింది.