Maldives Trips: మాల్దీవుల ట్రిప్‌లను రద్దు చేసుకుంటున్న భారతీయులు.. మీరు వెళ్తున్నారా?

ఇరు దేశాల మధ్య దౌత్యపర ఆందోళన నెలకొంది. మాల్దీవులు కొత్త అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు రేపటి నుంచి చైనాలో పర్యటించనున్నారు.

Maldives Trips: మాల్దీవుల ట్రిప్‌లను రద్దు చేసుకుంటున్న భారతీయులు.. మీరు వెళ్తున్నారా?

Modi

భారత ప్రధాని మోదీ లక్షద్వీప్‌ పర్యటనపై మాల్దీవుల మంత్రి జహీద్ రమీజ్ చేసిన కామెంట్ల ప్రభావం ఇరు దేశాలపై తీవ్రంగా పడుతోంది. మోదీ పర్యటన అక్కడి పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ఉంటే సహీద్ చేసిన వ్యాఖ్యలు మాత్రం మరోలా ఉన్నాయి. దీంతో చాలా మంది భారతీయులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకుంటున్నామంటూ పోస్టులు చేస్తున్నారు.

ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా పోస్ట్ చేస్తున్నారు. తాము రద్దు చేసుకున్న టూర్‌కి సంబంధించిన స్క్రీన్ షాట్లను చాలా మంది పోస్ట్ చేశారు. మాల్దీవులు అధిక శాతం భారతీయ పర్యాటకుల మీదే ఆధారపడుతుంది. అటువంటిది భారత్ పైనే మాల్దీవుల మంత్రి అనవసరంగా నోరు పారేసుకున్నారు.

అలాగే, #BoycottMaldives అనే హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. ఇరు దేశాల మధ్య దౌత్యపర ఆందోళన నెలకొంది. మాల్దీవులు కొత్త అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు రేపటి నుంచి చైనాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భారత్, మాల్దీవుల మధ్య మరింత అగ్గి రాజుకుంటోంది.

మాల్దీవుల మంత్రి జహీద్ రమీజ్ సామాజిక మాధ్యమాల ద్వారా తాజాగా స్పందిస్తూ.. తమ దేశాన్ని భారత్‌ లక్ష్యంగా చేసుకుంటుందన్న విషయం తెలిసిందే. బీచ్‌ పర్యాటకంలో తమ దేశంతో పోటీపడడంలో భారత్‌ సవాళ్లు ఎదుర్కొంటోందని ఆయన ఆరోపణలు చేయడం కలకలం రేపింది.

MS Dhoni : హుక్కా తాగింది ధోనినేనా..! ఏఐ సాయంతో డీప్ ఫేక్ వీడియో సృష్టించారా..! ఏదీ నిజం..!