UP Election 2022 : నామినేషన్ వేయనున్న యోగి ఆదిత్యనాథ్

యోగి నామినేషన్ వేయనున్నారు. గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిలుస్తున్నారు. మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు...

Up Cm Yogi Adityanath

Yogi File Nomination : ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ప్రధానంగా అందరి దృష్టి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం వైపు ఉంది. ఇక్కడ జరిగే ఎన్నికలు దేశ రాజకీయాలపై స్పష్టమైన ప్రభావం చూపెడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అధికారంలో ఉన్న బీజేపీ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది. బీజేపీని ఎదుర్కొనేందుకు ఎస్పీ ప్రణాళికలు రచిస్తోంది. ఇదిలా ఉంటే.. బీజేపీ అభ్యర్థి యోగి నామినేషన్ వేయనున్నారు. గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిలుస్తున్నారు. మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

Read More : Money Laundering : డొల్ల కంపెనీలతో మనీ లాండరింగ్‌కు పాల్పడిన చైనా కంపెనీలు

ఉదయం 11:40కి నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు సమయంలో యోగి వెంట ఉండనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉండనున్నారు. నామినేషన్‌కు ముందు 10:50 కి గోరఖ్ పూర్ మహారానా ప్రతాప్ ఇంటర్ కళాశాలలో ఎన్నికల సభలో యోగి ఆదిత్య నాథ్, అమిత్ షా, రాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొననున్నారు. యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

Read More : Viral‌ tweet : మలయాళంలో దుబాయ్‌ ప్రధాని ట్వీట్..అరబిక్ లో స్పందించిన కేరళ సీఎం

గత ఐదు సంవత్సరాల్లో కీలక లక్ష్యాలన్నింటినీ బీజేపీ నేరవేర్చిందని, వ్యాపారంలో రాష్ట్రాన్ని 14 నుంచి 2వ ర్యాంక్ కు తీసుకొచ్చామన్నారు యూపీ సీఎం యోగి. మౌలిక సదుపాయాల విషయంలో రెండో స్థానంలో రాష్ట్రం కొనసాగుతోందని, పెట్టుబడి దారులు యూపీని ఎంచుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దేశంలోనే రెండవ స్థానానికి చేరుకుందని, కేవలం ఐదేళ్లలో యూపీ ఆర్థిక వ్యవస్థను నంబర్ 2 స్థానానికి తీసుకెళ్లామని చెప్పారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను రూ. 2,00,000 కోట్ల నుంచి రూ. 6,00,000 కోట్లకు పెంచామన్నారు సీఎం యోగి.