Money Laundering : డొల్ల కంపెనీలతో మనీ లాండరింగ్‌కు పాల్పడిన చైనా కంపెనీలు

డొల్ల కంపెనీలు ద్వారా చైనీయులు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని విజయవాడ పోలీసుకు ఫిర్యాదుఅందింది. ఆంధ్రప్రదేశ్ రిజిస్త్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) అధికారులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుక

Money Laundering : డొల్ల కంపెనీలతో మనీ లాండరింగ్‌కు పాల్పడిన చైనా కంపెనీలు

China companies money landering

Money Laundering :  డొల్ల కంపెనీలు ద్వారా చైనీయులు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని విజయవాడ పోలీసుకు ఫిర్యాదు అందింది. ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) అధికారులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దేశవ్యాప్తంగా చైనీయులు డొల్ల కంపెనీలు సృష్టించినట్లు ఆర్వోసీ అధికారులు గుర్తించారు. ఆంధ్ర‌ప్రదేశ్‌లో నాలుగు, తెలంగాణలో 12, కర్ణాటకలో 200, తమిళనాడులోనూ పలు బోగస్ కంపెనీలు స్థాపించినట్టు అధికారుల దృష్టికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురం, చిత్తూరు, విశాఖపట్నం, తిరుపతి కేంద్రాలుగా వీరుకంపెనీల ఏర్పాటు చేశారు.

వీటిలో చైనా పెట్టుబడులు, చైనీయులతో పాటు స్థానికంగా ఉన్న కొందరిని డమ్మీ డైరెక్టర్లుగా చేర్చి కంపెనీల ఏర్పాటుచేసి రిజిష్టర్ చేశారు. వీటి ద్వారా ఏటా వందల కోట్ల   రూపాయలు టర్నోవర్ జరిగినట్లు చూపించారు.  2017 నుండి ఈ వ్యవహారం జరుగుతున్నట్లు తెలుసుకున్నారు.
Also Read : Covid-19 Update : దేశంలో నిన్న కొత్తగా 1,49,394 కోవిడ్ కేసులు నమోదు
ఈ కార్యకలాపాల ద్వారా వందల కోట్ల రూపాయల మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానించిన ఆర్వోసి అధికారులు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.