ఫెర్రిస్‌ వీల్‌పై బాలికకు ఊహించని విధంగా ప్రమాదం.. రాడ్‌కు చిక్కుకుపోయి జుట్టు మొత్తం ఊడిపోయి..

అప్పటికే ఆ అమ్మాయి జుట్టు మొత్తం తెగిపోయి స్వింగ్ రాడ్‌కు వేలాడుతూ కనపడింది.

ఎంతో సంబరపడిపోతూ ఫెర్రిస్‌ వీల్‌పై తిరుగుతున్న ఓ బాలికకు ఊహించని విధంగా ప్రమాదం జరిగింది. ఆ బాలిక జుట్టు ఫెర్రిస్‌ వీల్‌ రాడ్‌కు చిక్కుకుపోయి ఆమె జుట్టు మొత్తం ఊడిపోయింది. ఆమె తలపై భాగం అంతా రక్తంతో తడిసిపోయింది.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో జరిగిన ఓ ఫెయిర్‌లో చోటుచేసుకుంది. ఫెర్రిస్ వీల్‌ను ఆపడానికి అక్కడి వారు పరుగులు తీసి చివరకు దాన్ని ఆపారు. అప్పటికే ఆ అమ్మాయి జుట్టు మొత్తం తెగిపోయి స్వింగ్ రాడ్‌కు వేలాడుతూ కనపడింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో కనపడింది.

ఆమె తలపై భాగం చర్మం ఊడిపోయి కనపడిన తీరు వీడియో చూసిన వారి మనసును కలవరపర్చేలా ఉంది. తాల్గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధోనగర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆ బాలిక పేరు అనురాధా కర్తేరియా అని అధికారులు తెలిపారు. ఆమెకు తగిలిన గాయాలకు స్పృహలేకుండా పడిపోయిందని అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ బాలిక పరిస్థితి విషయంగా ఉందని వివరించారు.

వికారాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. కలెక్టర్, అధికారుల వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి