మరదలిపై దారుణం చేయించడానికి లోన్ తీసుకున్న బావ.. కిరాయి రౌడీలను పిలిచి..

మరదలితో అతడు కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నాడని పోలీసులు చెప్పారు.

Crime

సొంత మరదలిని సామూహిక అత్యాచారం చేయించి, హత్య చేశాడు ఓ వ్యక్తి. ఆ పనులు చేయించడానికి అతడి వద్ద డబ్బులు లేకపోయినా.. రూ.40,000 లోన్‌ తీసుకుని మరీ చేయించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. దీనిపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు వివరాలు తెలిపారు.

మరదలిపై హత్యాచారం చేయించడానికి ఆశీష్ అనే వ్యక్తి ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకున్నాడని పోలీసులు చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడని అరెస్టు చేశామని, ఇద్దరు కాంట్రాక్ట్‌ కిల్లర్లు పరారీలో ఉన్నారని తెలిపారు. మీరట్ జిల్లాలోని ఓ అటవీ ప్రాంతంలో బాధిత మహిళ మృతదేహం కాలిపోయి, ఛిద్రమై కనపడిందని పోలీసులు చెప్పారు.

Also Read: ఆటా కుక్కదే.. వేటా కుక్కదే.. నిద్రను డిస్టర్బ్‌ చేసినందుకు.. చిరుతను కుక్క ఎలా వేటాడిందో చూడండి..
మృతదేహాన్ని గుర్తించడం మొదట పోలీసులకే సవాలుగా మారింది. బాధితురాలి తల్లిదండ్రులను పోలీసులు పిలిపించారు. ఆమె కాలిపోయిన బట్టలను, చెప్పులను, ఉంగరాన్ని చూసి ఆమెను తల్లిదండ్రులు గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం పోలీసులు ఆసుపత్రికి పంపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలిని ఆమె బావ ఆశీష్, మరో ఇద్దరు చేత గొంతు నులిమి చంపారు. సాక్ష్యాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో ఆమె మృతదేహానికి నిప్పంటించారు. ఆశీష్ తన భార్య చెల్లెలు అయిన బాధితురాలితో కొంత కాలంగా సన్నిహిత సంబంధాన్ని కొనసాగించాడని తెలిసింది.

ఆమె ఏదో విషయంలో ఆశీష్‌ను బెదిరిస్తుండడంతో ఆమెను అడ్డు తొలగించుకోవడానికి ఆశీష్‌ ఆ కుట్ర పన్నాడు. బాధితురాలు జనవరి 23న అదృశ్యం కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు చివరకు ఆశీషే ఆమెను చంపాడన్న నిర్ధారణకు వచ్చారు.