ఆటా కుక్కదే.. వేటా కుక్కదే.. నిద్రను డిస్టర్బ్‌ చేసినందుకు.. చిరుతను కుక్క ఎలా వేటాడిందో చూడండి..

కుక్క ధైర్యాన్ని చూసిన గ్రామస్థులు ముక్కు మీద వేలేసుకున్నారు.

ఆటా కుక్కదే.. వేటా కుక్కదే.. నిద్రను డిస్టర్బ్‌ చేసినందుకు.. చిరుతను కుక్క ఎలా వేటాడిందో చూడండి..

Updated On : February 3, 2025 / 1:56 PM IST

వీధి కుక్కకు చిరుత భయపడుతుందా? భయపడదు కదా..? అసలు చిరుతను చూస్తేనే పరుగులు తీస్తుంది కుక్క. అటువంటిది ఓ కుక్క చిరుతను పరుగులు తీయించింది.

వీధి కుక్క దెబ్బకు చిరుత పారిపోయి చెట్టు ఎక్కేసింది. ఈ ఘటన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. తిర్యాని మండలంలోని చింతపల్లి గ్రామంలో చిరుత సంచరించింది. ఆ సమయంలో వీధిలో ఓ కుక్క నిద్రపోతోంది. దాన్ని తినేందుకు చిరుత మెల్లిగా అడుగులు వేస్తూ దాని దగ్గరకు వచ్చింది.

ఆ సమయంలో కుక్క ఒక్కసారిగా కళ్లు తెరిచి చూసింది. సీన్ రివర్స్‌ అయింది. చిరుతపై కుక్క ఎదురు తిరిగింది. దీంతో చిరుతకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. కుక్క ధాటికి చిరుత పరుగులు తీసింది.

ఓర్నాయనో.. 333 కోట్లు టార్గెట్ అంట.. 100మంది యువతులతో.. బత్తుల ప్రభాకర్ కేసు విచారణలో సంచలన విషయాలు..

చిరుత పరుగులు తీస్తుంటే దాని వెంటే పడింది కుక్క. చివరకు ఆ చిరుత చెట్టుపైకి ఎక్కి తనను తాను రక్షించుకుంది. కుక్క చెట్టు కిందే ఉండి, మొరగడంతో తమ గ్రామంలోకి చిరుత వచ్చిన విషయాన్ని గ్రామస్థులు గుర్తించారు.

చెట్టుపై చిరుత కనపడడంతో పోలీసులతో పాటు అటవీ శాఖ సిబ్బందికి గ్రామస్థులు సమాచారం అందించారు. అధికారులు చిరుతను పట్టుకునే ప్రయత్నాలు చేశారు. చిరుతను కుక్క తరమడం తాము ఎన్నడూ చూడలేదని, ఇదే మొదటిసారి చూస్తున్నామని గ్రామస్థులు అన్నారు.