ఓర్నాయనో.. 333 కోట్లు టార్గెట్ అంట.. 100మంది యువతులతో.. బత్తుల ప్రభాకర్ కేసు విచారణలో సంచలన విషయాలు..

క్రిమినల్ బత్తుల ప్రభాకర్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఓర్నాయనో.. 333 కోట్లు టార్గెట్ అంట.. 100మంది యువతులతో.. బత్తుల ప్రభాకర్ కేసు విచారణలో సంచలన విషయాలు..

Criminal Battula Prabhakar

Updated On : February 3, 2025 / 1:46 PM IST

Battula Prabhakar Case: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ లో కాల్పుల ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. చివరికి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు 14రోజులు రిమాండ్ విధించింది. పోలీసులు ప్రభాకర్ ను రిమాండులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విచారణలో మైండ్ బ్లోయింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభాకర్ క్రిమినల్ హిస్టరీ, లైఫ్ స్టైల్ చూసి పోలీసులుసైతం ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ప్రభాకర్ తన జీవితంలో రెండు టార్గెట్లు పెట్టుకున్నాడట.

Also Read: చోళీకే పీఛే క్యాహై అంటూ పెళ్లికొడుకు డ్యాన్స్.. చల్ నా కూతుర్ని నీకివ్వను పొమ్మన్న వధువు తండ్రి.. ఆ పెళ్లికొడుకు..

చీకటి వ్యవహారం ఒక్కొక్కటిగా..
నిందితుడు బత్తుల ప్రభాకర్ ది ఏపీలోని చిత్తూరు జిల్లా. అక్కడే ఎనిమిదో తరగతి వరకు చదువుకున్న ప్రభాకర్ ఈజీ మనీకి అలవాటుపడి చిన్నతనం నుంచే దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాకర్ పై 80కేసులు నమోదయ్యాయి. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 16 కేసులు ఉన్నాయి. 2023 నవంబర్ నెలలో పోలీసుల నుంచి ప్రభాకర్ తప్పించుకొని పారిపోయాడు. మెయినాబాద్ చోరీ కేసుకు సంబంధించి దర్యాప్తులో ప్రభాకర్ వేలిముద్రలు గుర్తించిన పోలీసులు.. సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా మాస్కులు ధరిస్తూ ఎస్కేప్ అవుతున్నాడు. దీంతో పోలీసులు ప్రభాకర్ కదలికలపై నిఘా పెట్టారు. మాదాపూర్ జోన్ పరిధిలో అన్ని పబ్ ల వద్ద నిఘా పెట్టారు. చివరికి సాహసోపేతంగా అతని ఆటకట్టించారు. అయితే, పోలీసుల విచారణలో బత్తుల ప్రభాకర్ చీకటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

Also Read: బెంగాల్‌లో మరో సంచలనం.. ఆర్జీ కర్ కాలేజీలో మరో అమ్మాయి.. తల్లి ఇంటికి వెళ్లి చూసేసరికి..

100 మంది యువతులతో..
బత్తుల ప్రభాకర్ ను పోలీసులు విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రూ. 333 కోట్లు సంపాదించి ఆ తరువాత నేరాలు మానేయాలని ప్రభాకర్ టార్గెట్ పెట్టుకున్నాడట. అంతేకాదు.. 100మంది యువతులతో స్నేహం చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడట. బీహార్లో కొందరితో పరిచయం పెంచుకుని గన్స్ కొనుగోలు చేశాడు. అయితే, ప్రభాకర్ చెస్ట్ మీద రెండు వైపులా పచ్చ బొట్లు వేయించుకున్నాడు. చిన్ననాటి నుంచే దొంగతనాలు చేయడం మొదలుపెట్టిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదయ్యాయి. బిట్టు, రాహుల్ రెడ్డి, సర్వేశ్వర రెడ్డి, రాజు వంటి మారు పేర్లుతో ప్రభాకర్ దొంగతనాలకు పాల్పడుతూ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

 

3వేల నుంచి 3లక్షల వరకు..
బత్తుల ప్రభాకర్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభాకర్ 3వేల రూపాయల దొంగతనం నుంచి మొదలుపెట్టి.. ఒకేరోజు మూడు లక్షలు, ఆపై 33లక్షలు చోరీ చేయాలని టార్గెట్ పెట్టుకొనిమరీ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అతను నార్సింగ్ లోని గేటెడ్ కమ్యూనిలో ఉంటున్నాడు. ఒరిస్సాకు చెందిన యువతితో సహజీవనం చేస్తున్నాడు. స్నేహితుల పేర్లతో సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లను కొనుగోలుచేసి దర్జాగా తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో ప్రభాకర్ నెలకో కారు మారుస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.