చోళీకే పీఛే క్యాహై అంటూ పెళ్లికొడుకు డ్యాన్స్.. చల్ నా కూతుర్ని నీకివ్వను పొమ్మన్న వధువు తండ్రి.. ఆ పెళ్లికొడుకు..
దేశ రాజధాని ఢిల్లీలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పెండ్లి కుమారుడు ఫ్రెండ్స్ తో కలిసి బాలీవుడ్ పాపులర్ సాంగ్ కు డ్యాన్స్ చేశాడని వధువు తండ్రి ఏకంగా పెండ్లినే క్యాన్సిల్ చేశాడు.

Wedding Cancelled
Wedding Cancelled: పెండ్లి వేడుక అంటే కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, స్నేహితులతో సందడి వాతావరణ నెలకొంటుంది. ఇక వరుడి తరుపున స్నేహితుల హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుడ్ని ఊరేగింపుగా తీసుకొచ్చే సమయంలో డ్యాన్సులతో హోరెత్తిస్తారు. ఇలాగే ఢిల్లీలోని ఓ వివాహ వేడుకలో జరిగింది. స్నేహితులు, బంధువులు డ్యాన్స్ చేస్తూ వరుడ్ని ఊరేగింపుగా పెండ్లి మండపానికి తీసుకొచ్చారు. అక్కడ స్నేహితువు, పెండ్లికి వచ్చిన కొందరు అతిథులు ప్రోత్సహించడంతో వరుడుకూడా డ్యాన్స్ వేశాడు. దీంతో వధువు తండ్రికి కోపం వచ్చింది. వెంటనే పెండ్లిని క్యాన్సిల్ చేసేశాడు. ఇది విన్న వధువు కన్నీటి పర్యాంతం కాగా.. వరుడు, అతని కుటుంబ సభ్యులకు ఏం జరుగుతుందో అర్ధంకాక అయోమయానికి గురయ్యారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది..? వధువు తండ్రి పెండ్లిని ఎందుకు క్యాన్సిల్ చేశాడనే వివరాల్లోకి వెళితే..
Also Read: Faizabad MP Awadhesh Prasad : ఊకో ఊకో సారు.. లైవ్ లో బోరున విలపించిన ఎంపీ.. ఎందుకో తెలుసా..
దేశ రాజధాని ఢిల్లీలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పెండ్లి కుమారుడు ఫ్రెండ్స్ తో కలిసి బాలీవుడ్ పాపులర్ సాంగ్ ‘చోళీ కే పీఛే క్యా హై’కు డ్యాన్స్ చేయడంతో పెళ్లి కూతురు తండ్రికి కోపమొచ్చింది. దీంతో ఏకంగా పెండ్లినే రద్దు చేశాడు. ఇందుకు సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల ఢిల్లీలో ఓ వరుడు తన పెండ్లి ఊరేగింపుతో వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో వరుడి స్నేహితులు ఫేమస్ బాలీవుడ్ పాట ‘చోళీకే పీఛే క్యా హై’ పెట్టి అతడ్ని డ్యాన్స్ చేయాలని ఒత్తిడి చేశారు. పెండ్లి వేడుకకు వచ్చిన కొందరు అతిథులుసైతం డ్యాన్స్ చేయాలని వరుడిని ప్రోత్సహించారు. దీంతో అతను ఆ సాంగ్ కు డ్యాన్స్ చేశాడు. ఈ విషయం తెలిసిన వధువు తండ్రి అక్కడికి చేరుకొని ఆగ్రహంతో ఊగిపోయాడు. వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాడు.
పెండ్లి వేడుకలో వరుడు డ్యాన్స్ చేయడమంటే కుటుంబ విలువలను అవమానించడమేనని పేర్కొంటూ వధువు తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ పెండ్లిని రద్దుచేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ అనూహ్య పరిమాణంతో వరుడు, వారి కుటుంబ సభ్యులతో పాటు పెండ్లికి వచ్చిన వారు కంగుతిన్నారు. పెండ్లి కుమార్తె కన్నీటి పర్యాంతమైంది. ఈ క్రమంలో పెండ్లికి వచ్చిన అతిధుల్లో కొందరు పెండ్లి కుమార్తె తండ్రి వద్దకు వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా అతను పెండ్లిని నిర్వహించేందుకు ససేమీరా అనడంతో.. పెండ్లి కొడుకు, అతని కటుంబ సభ్యులు మండపం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. పెళ్లి వేడుకను రద్దుచేసి వధువు తండ్రి సరైన నిర్ణయమే తీసుకున్నాడని ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా.. తన పెళ్లిలో ఇటువంటి పాటలు పెడితే తాను తప్పకుండా డ్యాన్స్ చేసేవాడిని అంటూ మరో నెటిజన్ పేర్కొన్నాడు. ఇలా పలువురు నెటిజన్లు వారి అభిప్రాయాలు తెలుపుతూ పోస్టులు చేశారు. అధికశాతం మంది వధువు తండ్రి నిర్ణయాన్ని తప్పుబట్టారు.