Stray Dogs Campaign: వీధి కుక్కలపై పోస్టర్లు అంటించి వింత ప్రచారం

ఎన్నికల ప్రచారానికి నాయకులు చేసే వాగ్దానాలకు హద్దుల్లేని ఘటనలు చూసే ఉంటాం కానీ, ఇక్కడ వింత ప్రచారం జరుగుతుంది. ఆటోలు, ట్రాక్టర్లు..

Stray Dogs Campaign: ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే పంచాయతీ ఎన్నికలకు ప్రచారం ఊపందుకుంది. ఇక ఎన్నికల ప్రచారానికి నాయకులు చేసే వాగ్దానాలకు హద్దుల్లేని ఘటనలు చూసే ఉంటాం కానీ, ఇక్కడ వింత ప్రచారం జరుగుతుంది. ఆటోలు, ట్రాక్టర్లు, బైక్లు, కార్లు ప్రచారానికి వాడిన సందర్భాలు తెలుసు కానీ, ఇలా వీధి కుక్కలతో ప్రచారం చేస్తూ అవి స్వచ్ఛందంగా తమ కోసం ప్రచారం చేస్తున్నాయని చెప్తున్నారు ఆ పార్టీ కార్యకర్తలు.

రా బరేలీ, బల్లియా జిల్లాల నుంచి ఇద్దరు వ్యక్తులు ఎన్నికల ప్రచారానికి వీధి కుక్కలను వాడేస్తున్నారు. వాటిపై తమ ఎన్నికల గుర్తు ఉన్న పాంప్లెట్లు అంటించి వీధుల్లో తిరిగేలా చేస్తున్నారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో జంతు ప్రేమికులు, యాక్టివిస్టులు సరైన పని కాదంటూ కామెంట్లు మొదలెట్టేశారు.

రీనా మిశ్రా అనే యానిమల్ యాక్టివిస్ట్.. ఎన్నికల ప్రచారం కోసం ఆ వ్యక్తి ముఖంపై పోస్టర్లు అంటిస్తే ఎలా ఉంటుంది. ఎందుకంటే కుక్క అభ్యంతరం వ్యక్తం చేయదు కాదు కాబట్టే అంటించారా.. పోలీసులు వెంటనే అటువంటి క్యాండిడేట్లపై యాక్షన్ తీసుకుని మరోసారి జరగకుండా చూడాలని అంటున్నారు.

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఒకరు మాట్లాడుతూ.. వీధి కుక్కలతో ప్రచారం చేయించకూడదని ఎక్కడా రూల్ లేదు. మేం జంతువులకు ఎటువంటి హానీ చేయడం లేదు. ఇంకా వాటిని రోజూ పోషిస్తున్నాం కూడా. ఇటువంటి పనులు చేసి ఓటర్లు ఆకర్షించొచ్చని ఇలా చేశాం’ అని చెప్పుకొచ్చాడు.

యూపీ పంచాయతీ ఎన్నికలు ఏప్రిల్ 15నుంచి ఏప్రిల్ 29వరకూ ఎన్నికలు 4దశలుగా జరగనున్నాయి. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ 311 పోలింగ్ స్టేషన్లలో 958పోలింగ్ బూత్ లు వేదికగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అక్కడ మొత్తం 5లక్షల 56వేల 86మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల ఫలితాలను మే2న ప్రకటిస్తారు.

ట్రెండింగ్ వార్తలు