దేశవ్యాప్తంగా సంచలనం అయిన గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌లో ఉజ్జయిని నుంచి వికాస్ దుబేని తీసుకుని వస్తున్న ఎస్‌యూవీలో కానిస్టేబుల్‌కు కరోనా వైరస్ ఉన్నట్లుగా తేలిందట. ఉజ్జయిని నుంచి వస్తున్న ఎస్‌యూవీలో కానిస్టేబుల్‌కు కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు.
కానిస్టేబుల్‌కు కరోనా వైరస్ సోకినట్లు అధికారి వెల్లడించారు. అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చినట్లుగా చెబుతున్నారు.
అదే ఎస్‌యూవీ వాహనంలో మరో నలుగురు పోలీసులు ఉన్నట్లుగా అధికారి తెలిపారు. కాన్పూర్ సమీపంలోని ఉజ్జయిని నుంచి వికాస్‌కు వస్తున్న ఎస్‌యూవీని అకస్మాత్తుగా బోల్తా పడింది. దీని తరువాత, తప్పించుకోవడానికి ప్రయత్నించగా వికాస్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.
ఎన్‌కౌంటర్ సమయంలో సోకిన కానిస్టేబుల్‌కు కూడా గాయాలయ్యాయి. కానిస్టేబుల్‌తో పరిచయం ఉన్న వ్యక్తులను గుర్తించామని ఆరోగ్య అధికారి చెబుతున్నారు.