Woman Bus Driver : బస్సు డ్రైవర్‌గా భార్య.. కండక్టర్‌గా భర్త.. ఇంట్రస్టింగ్ స్టోరీ!

వేద్ కుమారి సంస్కృతంలో ఎంఏ చదివారు. తాను ఢిల్లీ పోలీసు ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుండగా డ్రైవర్ ఉద్యోగం కోసం ప్రకటన వచ్చిందని కుమారి చెప్పారు.

UP Police job aspirant turns bus driver

Woman Bus Driver – Husband Conductor : ఢిల్లీ పోలీస్‌లో ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న ఓ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మహిళ ఉత్తరప్రదేశ్ రోడ్‌వేస్‌లో బస్సు డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరారు. తన భర్త కండక్టర్‌గా ఆమెకు సహాయం చేస్తున్నాడు. ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన వేద్ కుమారి ఉద్యోగంలో చేరేందుకు భయపడవద్దని కోరారు. వేద్ కుమారి, ఆమె భర్త ముఖేష్ ప్రజాపతికి కౌశంబి-ఘజియాబాద్ నుండి బుదౌన్ మార్గంలో నడిచే బస్సు కేటాయించారు.

వేద్ కుమారి సంస్కృతంలో ఎంఏ చదివారు. తాను ఢిల్లీ పోలీసు ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుండగా డ్రైవర్ ఉద్యోగం కోసం ప్రకటన వచ్చిందని కుమారి చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్ కింద ఉత్తరప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ మద్దతుతో వేద్ కుమారి 2021లో కాన్పూర్‌లోని మోడల్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుండి హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ పొందారు.

Also Read : హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ వచ్చిన భార్యకు భర్త ఎంత గొప్పగా స్వాగతం చెప్పాడో చూడండి..

ఆ తర్వాత ఏప్రిల్ 2023లో ఆమెను 10 నెలల పాటు కౌశాంబి డిపోకు శిక్షణకు పంపారు. కౌశాంబి – ఘజియాబాద్ నుండి బుదౌన్ మార్గంలో కుమారి మొదటి మహిళా డ్రైవర్ కావడం విశేషం. వేద్ కుమారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు 10వ తరగతి, కుమార్తె 9వ తరగతి చదువుతున్నారు.

డ్రైవర్-కండక్టర్ దంపతులు తమ ఉద్యోగాల్లో బిజీగా ఉండటంతో పెద్ద కొడుకు వారి కుమార్తెను చూసుకుంటాడు. కుమారి ప్రస్తుతం కాంట్రాక్టు హోదాలో డ్రైవర్ గా ఉన్నారు. అయితే, తన ఉద్యోగంలో దేనికీ భయపడాల్సిన అవసరం లేదని ఆమె నమ్ముతున్నారు. ఏ పని కష్టం కాదు, మహిళలు తలచుకుంటే ఏదైనా చేయగలరని ఆమె పేర్కొన్నారు.