Hyderabad : హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ వచ్చిన భార్యకు భర్త ఎంత గొప్పగా స్వాగతం చెప్పాడో చూడండి..
భర్త చిన్న కాంప్లిమెంట్ ఇస్తేనే భార్య సంతోషపడిపోతుంది. అలాంటిది తన విజయాన్ని జీవితంలో మర్చిపోలేని విధంగా సెలబ్రేట్ చేస్తే? .. ఓ భార్యకు భర్త ఇచ్చిన సర్ప్రైజ్ చూడండి. ఫిదా అయిపోతారు.

Hyderabad
Hyderabad : ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది అంటారు. అలాగే ప్రతి స్త్రీ సక్సెస్ వెనుక ఖచ్చితంగా పురుషుడి సహకారం , ప్రోత్సాహం ఉంటాయి. భార్య హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోష్ తీసుకుని ఇంటికి వచ్చిన ఆనందాన్ని ఆమె భర్త ఎలా సెలబ్రేట్ చేసాడో చూస్తే .. ఆశ్చర్యపోతారు.. అంతేకాదు ముచ్చట పడతారు.
Ahmedabad : మహిళా కానిస్టేబుల్ మంచి పని.. వీడియో వైరల్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజనులు
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కాంప్లిమెంట్లు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. కెరియర్‌కి సంబంధించి ఇద్దరి ఎదుగుదలలో కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే విజయాలు వరిస్తాయి. తన భార్యకు హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ వచ్చిందన్న ఆనందాన్ని ఆమె భర్త ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయాలనుకున్నాడు. ఆమె జీవితంలో మర్చిపోలేని విధంగా సర్ప్రైజ్ ఇచ్చాడు. హైదరాబాద్ ఎస్.ఆర్.నగర్లో నివాసం ఉంటున్న కుటుంబం సంబరాలు చూస్తే ఫిదా అయిపోతారు. ఇంటికి వచ్చిన భార్యకు భర్త ఘన స్వాగతం పలికాడు.
Madhya Pradesh : కదులుతున్న రైలు కిందపడబోయిన మహిళను కాపాడిన RPF కానిస్టేబుల్
ఆమె ఇంటికి చేరుకునేసరికి బ్యాండు మేళాలతో కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. టపాకాయలు కాల్చారు. అంతేనా .. కేక్ కట్ చేయించి.. డ్యాన్స్‌లతో హోరెత్తించారు. అతని భార్య కళ్లలో ఆనందం చూడాలి. మాటల్లో చెప్పలేం. ఆ ఇల్లంతా సందడిగా మారిపోయింది. చిన్న చిన్న కాంప్లిమెంట్లు ఇస్తేనే సంతోషపడిపోయే భార్యలుంటారు. ఇక ఇంత గ్రాండ్‌గా వెల్కం చెప్పిన భర్త ప్రేమకి ఆమె ఫిదా అయిపోయింది. ఈ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఈ సంతోషాన్ని ఆమె జీవితంలో మర్చిపోలేదని.. ప్రతి సందర్భాన్ని ఇలాగే సెలబ్రేట్ చేసుకుని సంతోషంగా ఉండాలని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఇలాంటి సర్ప్రైజ్లు బంధాలు మరింత స్ట్రాంగ్ చేస్తాయనడంలో అసలు సందేహం లేదు.
View this post on Instagram