Pahalgam Terror Attack: జమ్మూకశ్మీర్ లోని పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 26మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కొత్తగా పెళ్లైన జంటలతోపాటు సరదాగా గడిపేందుకు కుటుంబంతో కలిసి విహారయాత్రకు వచ్చిన వారూ ఉన్నారు.
పహల్గాంలోని బైసరాన్ ప్రాంతంకు మినీ స్విట్జర్లాండ్ గా పేరుంది. అక్కడి ప్రకృతి అందాలను తిలకించేందుకు రెండుకళ్లు చాలవు. అలాంటి ప్రదేశంలో సంతోషంగా గడిపేందుకు వెళ్లిన యాత్రికులపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. సైనిక దుస్తుల్లో ఒక్కసారిగా చుట్టుముట్టి కాల్పులు జరిపారు.. తప్పించుకునేందుకు ప్రయత్నించిన వారిని వెంటపడి మరీ చంపేశారు. క్షణాల్లోనే ఆహ్లాదకరమైన ప్రాంతంలో రక్తపుటేర్లు పారాయి. అప్పటి వరకు తమతో సంతోషంగా గడిపిన భర్తలు క్షణాల్లో విగతజీవులుగా పడిపోవటంచూసి మహిళలు కన్నీళ్లపర్యాంతమవుతూ బోరున విలపించారు.
పహల్గాం ఉగ్రవాద దాడి తరువాత జరిగిన హృదయ విదారక సంగతులు వెలుగు చూస్తున్నాయి. ఈ విషాదకర దాడిలో కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్లోరిడాలోని బ్రాండన్ లో నివసిస్తున్న బితాన్ ఏప్రిల్ 8న భార్య సోహిని, మూడేళ్ల కుమారుడితో కలిసి కోల్ కతాకు వచ్చారు. వారు విహార యాత్రకోసం ఏప్రిల్ 16న కాశ్మీర్ కు వెళ్లారు. మంగళవారం పహల్గాం లో పర్యటిస్తున్న సమయంలో ఉగ్రవాదులు బితాన్ ను కాల్చిచంపేశారు.
ఈ ఘటనపై బితాన్ భార్య సోహిని మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యాంతమైంది. ‘‘మేము లాన్ మీద కూర్చొని ఉన్నాం. సైనిక దుస్తుల్లో కొందరు వ్యక్తులు వచ్చారు. మీరు హిందువునా..? ముస్లింనా అని ప్రశ్నించారు. వారు ఉగ్రవాదులని మాకు అర్ధమైంది. భయంతో వణికిపోయాం. ఎటూ కదలడానికి కూడా అవకాశమివ్వలేదు. నా భర్తపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. నేను కళ్లుమూసి తెరిచేలోపు నా భర్త కుప్పకూలిపోయి ఉన్నాడు. గురువారమే ఈ ప్రాంతం నుంచి తిరిగి వెళ్లిపోవాల్సి ఉంది. ఇంతలోనే ఇలా జరిగింది’’ అంటూ సోహిని కన్నీటి పర్యాంత మైంది. బితాన్ తండ్రి మాట్లాడుతూ.. ముందు కుటుంబ సభ్యులందరి విహారయాత్రకు వెళ్దామని అనుకున్నాం. కానీ, కోడలితో వెళ్లమని నేనే చెప్పా. మంగళవారం మధ్యాహ్నం కూడా నా కొడుకుతో మాట్లాడా.. సాయంత్రంలోపు చనిపోయాడని తెలిసింది.. అంటూ కన్నీటి పర్యాంతమయ్యాడు.
My heart goes out to the families of the victims of the devastating terrorist attack on the tourists in Jammu and Kashmir today.
One of the victims, Sri Bitan Adhikari, is from West Bengal. I have talked with his wife over phone. Though no words are enough to console her in…
— Mamata Banerjee (@MamataOfficial) April 22, 2025
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన బితాన్ అధికారి భార్య సోహినితో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్లో మాట్లాడారు. ఆమెను ఓదార్చారు.
ఉగ్రదాడిలో మృతుల వివరాలు..