Nirav Modi : నీరవ్ మోదీకి మరో షాక్

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు నీరవ్‌ మోదీకి న్యూయార్క్ లోని దివాలా కోర్టులో చుక్కెదురైంది. ఒకప్పుడు తాను పరోక్షంగా యజమానిగా ఉన్న మూడు కంపెనీల విషయంలో

Nirav Modi  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు నీరవ్‌ మోదీకి న్యూయార్క్ లోని దివాలా కోర్టులో చుక్కెదురైంది. ఒకప్పుడు తాను పరోక్షంగా యజమానిగా ఉన్న మూడు కంపెనీల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ తమపై రిచర్డ్ లెవిన్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలను కొట్టేయాలనంటూ నీరవ్ మోదీతో పాటు ఆయన సహచరులు చేసిన విజ్ణప్తిని కోర్టు తిరస్కరించింది.

కాగా,అమెరికా కేంద్రంగా పని చేసే ఫైర్​స్టార్​ డైమండ్, ఫాంటసీ ఇంక్, ఏ జాఫ్​ సంస్థలకు నీరవ్ మోదీ గతంలో పరోక్షంగా యజమానిగా ఉండేవారు. అయితే భారత్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ మూడు సంస్థలకు కోర్టు ట్రస్టీని నియమించింది.

మూడు అమెరికా సంస్థల ద్వారా నీరవ్ మోదీ అక్రమాలకు పాల్పడ్డారంటూ ట్రస్టీ రిచర్డ్ లెవిన్ ఓ పిటిషన్ దాఖలు చేశారు. నీరవ్​కు, ఆయన సన్నిహితులకు రుణాలు ఇచ్చి మోసపోయిన వారికి 15 మిలియన్ డాలర్లు పరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోర్టును కోరారు. అయితే రిచర్డ్ లెవిన్ ఆరోపణలను కొట్టేయాలని కోరుతూ నీరవ్ బృందం న్యూయార్క్ లోని దివాలా కోర్టుని ఆశ్రయించగా..వీరి విజ్ణప్తిని కోర్టు తిరస్కరించింది.

ALSO READ Lakhimpur Violence : లఖింపూర్ ఘటనపై బుధవారం సుప్రీం విచారణ

ట్రెండింగ్ వార్తలు